Begin typing your search above and press return to search.
ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ కుదేలైపోయినట్లేనా...?
By: Tupaki Desk | 25 Sep 2020 1:30 AM GMTకరోనా లాక్ డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన రంగాలలో సినీ ఇండస్ట్రీ ఒకటి. గత ఆరున్నర నెలలుగా థియేటర్స్ మూతపడిపోయి.. సినిమాలు రిలీజ్ అవకపోవడంతో ప్రొడ్యూసర్స్ నష్టాలు చవిచూస్తున్నారు. వీరితో పాటు సినిమా రిలీజులు లేకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబ్యూటర్లు కూడా తీవ్ర సంక్షభంలో కూరుకుపోయారు. ఒకవేళ రాబోయే రోజుల్లో థియేటర్స్ రీ ఓపెన్ చేసినా ఇవన్నీ మరో ఏడాది వరకు కోలుకునే పరిస్థితి లేదని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ కుదేలైపోయినట్లే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం కరోనా అయినప్పటికీ.. లోకల్ డిస్ట్రిబ్యూషన్ అంత పటిష్టంగా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ లేకపోవడం కూడా ఒక కారణమని అంటున్నారు. అక్కడ సరైన పంపిణీ సంస్థలు లేకపోవడం.. నిర్మాతలకి ఓవర్ ఫ్లోలు ఇవ్వడం.. తదితర అంశాలు ఇప్పుడు ఓవర్ సీస్ మార్కెట్ పై ప్రభావం చూపనున్నాయని తెలుస్తోంది.
కాగా, ఓవర్ సీస్ పంపిణీదారులు ఈ ఏడాది మార్చి లోపే రన్నింగ్ లో ఉన్న చాలా సినిమాలకు అడ్వాన్సులు ఇచ్చేశారని సమాచారం. అయితే అనుకోకుండా కరోనా లాక్ డౌన్ వచ్చి పడటంతో ఇప్పుడు వారంతా నిర్మాతల్ని డబ్బులు వెనక్కు ఇవ్వమని అడుగుతున్నారట. దీనికి నిర్మాతలు మాత్రం అడ్వాన్సులు వెనక్కి ఇచ్చే ప్రసక్తే లేదని.. థియేటర్స్ తెరిచే వరకు ఆగి పూర్తి అమౌంట్స్ క్లియర్ చేసి సినిమాలను తీసుకుపోవాల్సిందిగా సమాధానం ఇస్తున్నారట. అయితే థియేటర్స్ తెరిచాక ఓవర్ సీస్ ఆడియెన్స్ ప్రస్తుత పరిస్థితుల్లో టిక్కెట్స్ కొని మరీ సినిమాలు చూడటానికి వస్తారో లేదో అన్నది డౌట్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో ఏడాది పాటు ఓవర్సీస్ మార్కెట్ పై ఆశలు పెట్టుకోకపోవడమే మంచిందని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.