Begin typing your search above and press return to search.
'ఆచార్య' ఫస్ట్ లుక్ కాపీ అంటున్నారే..?
By: Tupaki Desk | 23 Aug 2020 5:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి - డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న ''ఆచార్య'' చిత్రంపై భారీ అంచనాలున్నాయి. 'సైరా నరసింహారెడ్డి' వంటి హిస్టారికల్ మూవీ తరువాత చిరంజీవి నటిస్తున్న కమర్షియల్ మూవీ కావడంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ బర్త్ డే ని పురస్కరించుకొని 'ఆచార్య' చిత్ర ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ లో ధర్మస్థలి అనే ఊరు నేపథ్యంలో నిస్సహాయులైన ప్రజలు చూస్తున్నప్పుడు.. ఎర్రని కండువా వేసుకున్న చిరంజీవి చేతిలో కత్తి పట్టుకొని పోరాడుతున్నట్లు చూపించారు. ధర్మం కోసం పోరాడే కామ్రేడ్ గా చిరంజీవి బ్యాక్ సైడ్ వ్యూ చూపించారు. టైటిల్ లోగో మరియు మోషన్ పోస్టర్ కి మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. అయితే 'ఆచార్య' మోషన్ పోస్టర్ కాపీ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
కాగా 'ఆచార్య' మోషన్ పోస్టర్ ని రచయిత కన్నెగంటి అనిల్ కృష్ణ రచించిన 'పుణ్యభూమి' అనే కథలోని సన్నివేశాన్ని తీసుకొని రూపొందించారని విమర్శలు వస్తున్నాయి. రైటర్స్ అసోసియేషన్ లో ఈ కథని అనిల్ కృష్ణ రిజిస్టర్ కూడా చేయించారని తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీలో ఇతర సినిమాల నుండి.. నవల నుంచి కొన్ని సీన్స్ ని అనుకరణ చేయడం కొత్తేమీ కాదు. గతంలో టాలీవుడ్ లోని చాలామంది స్టార్ డైరెక్టర్స్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఫస్ట్ లుక్ కూడా కాపీ చేసారనే కామెంట్స్ వినిపించాయి. మరి ఈ కామెంట్స్ పై 'ఆచార్య' టీమ్ ఎలా స్పందిస్తారో చూడాలి. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ మరియు మాట్నీ ఎంటెర్టైన్మెంట్ నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుత పరిస్థితులు చక్కబడిన తరవాత షూటింగ్ ను ప్రారంభించి.. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నారు.