Begin typing your search above and press return to search.

ఈ మేకప్ ఏంటి డార్లింగ్ ?

By:  Tupaki Desk   |   30 Aug 2019 2:12 PM GMT
ఈ మేకప్ ఏంటి డార్లింగ్ ?
X
కోట్లాది కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన సాహో ఎట్టకేలకు థియేటర్లలో అడుగు పెట్టింది. ఆకాశాన్ని అంటే అంచనాలతో టికెట్ ధరలతో ఈ మధ్యకాలంలో ఏ టాలీవుడ్ సినిమాకు చూడని బజ్ ని సొంతం చేసుకుని బంపర్ ఓపెనింగ్స్ తో ఖాతా మొదలుపెట్టింది. అయితే ఊహించని విధంగా మిక్స్డ్ టాక్ రావడం అభిమానులకు షాక్ కలిగిస్తున్నా ఓ రెండు రోజులు ఆగితే కానీ స్టార్ హీరోల సినిమాల ఫలితాలు డిసైడ్ చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు ఏం చెప్పలేం.

కానీ సినిమాలో ఉన్న అంశాల గురించిన చర్చ మాత్రం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ప్రభాస్ లుక్స్ మీద కామెంట్స్ బాగా పడుతున్నాయి. వాస్తవంగా చెప్పాలంటే ప్రభాస్ కొన్ని ఫ్రేమ్స్ లో అందంగా కొన్ని యాంగిల్స్ లో డల్ గా కనిపించి తనపై ఉన్న మ్యాన్లీ ఇమేజ్ కి పూర్తి న్యాయం చేయలేకపోయాడు. పాటల్లో పర్వాలేదు అనిపించినా సీన్స్ లో మాత్రం ఇతను మన బాహుబలేనా అనిపించేలా ఉన్నాడు

ఇక్కడ తప్పుబట్టాల్సింది టీమ్ నే. సినిమా మొత్తం ప్రభాస్ భుజాల మీదే ఉంటుందని ప్రేక్షకులు తనని తప్ప తెరమీద ఇంకెవరిని పట్టించుకునే మూడ్ లో ఉండరని తెలిసినా మేకప్ ఇంత పూర్ గా ఉండటం ఏమిటో వాళ్ళకే తెలియాలి.  తనకు ఇచ్చిన సీన్ రాసిచ్చిన డైలాగ్ చెప్పడం తప్ప ప్రభాస్ కూడా చేసిందేమి లేదు. అందుకే ఎప్పుడూ లేనిది ప్రభాస్ లుక్ మీద ఇంత నెగటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది.

హెయిర్ స్టైల్ కూడా ఒక్కోసారి ఒక్కోలా ఉండటం కూడా మైనస్సే. ఉదాహరణకు నీల్ నితీష్ ని ఓ రెస్టారెంట్ లో కలిసిన ప్రభాస్ ఆ మరుసటి క్షణమే సంబంధం లేని హెయిర్ స్టైల్ తో దర్శనమిస్తాడు. ఇలాంటివి ఇందులో బోలెడున్నాయి. ఇంత స్టైలిష్ యాక్షన్  ఎంటర్ టైనర్ లో డార్లింగ్ లుక్స్ ఇలా ఉండటం అంటే ఫ్యాన్స్ కు నిరాశ కాక మరేమిటి