Begin typing your search above and press return to search.
సర్దార్ హిందీ రిలీజ్.. రైట్ ఆర్ రాంగ్?
By: Tupaki Desk | 7 April 2016 5:09 AM GMTసర్దార్ గబ్బర్ సింగ్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. డైరెక్ట్ బాలీవుడ్ మూవీ రేంజ్ లో 8వందల థియేటర్లలో విడుదలవుతోంది. పవన్ బాలీవుడ్ ఎంట్రీపై అక్కడ చాలా రకాల డిస్కషన్స్ నడుస్తున్నాడు.
బాహుబలి అన్నిరకాల బోర్డర్లను చెరిపేసిందని.. సినిమా బాగుంటే ఎక్కడి ఆడియన్స్ అయినా చూడడానికి సిద్ధంగా ఉంటారని అంటున్నాడు తరణ్ ఆదర్శ్. బాలీవుడ్ లో రిలీజ్ ద్వారా దేశవ్యాప్తంగా ఇమేజ్ తెచ్చుకోవచ్చని.. ఇందులో తప్పేం లేదంటున్నాడు ట్రేడ్ ఇన్సైడర్ అతుల్ మోహన్. ఇది కేవలం డబ్బింగ్ మూవీ.. బాలీవుడ్ సినిమా అనడానికి లేదనే వాదన కూడా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ బాలీవుడ్ ఎంట్రీ కరెక్టే కానీ.. ఈ సినిమా కరెక్ట్ కాదనే వారు కూడా ఉన్నారు. అక్కడ ఇప్పటికే అక్షయ్ కుమార్ చేసిన గబ్బర్ 3 ఉంది అన్నది వారి వాదన.
పవన్ కళ్యాణ్ లాంటి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న స్టార్లు.. మరింతగా ఎదగడానికి బాలీవుడ్ ఉపయోగపడుతుందని నిర్మాత ప్రితీష్ నందీ అంటున్నారు. మరి ఇన్ని రకాల కామెంట్ల మధ్య రేపు విడుదల అవుతోంది సర్దార్ గబ్బర్ సింగ్. బాలీవుడ్ లో ఈ మూవీకి అతి పెద్ద పోటీగా.. హాలీవుడ్ డబ్బింగ్ సినిమా మోగ్లీని చెబుతున్నారు. అది తప్ప వేరే హిందీ మూవీ ఏదీ రిలీజ్ లేకపోవడం కలిసొచ్చే అంశం.