Begin typing your search above and press return to search.

శంత‌న్ పై కామెంట్లు శ్రుతిహాస‌న్ కి అతి పెద్ద జోకులు!

By:  Tupaki Desk   |   27 Dec 2022 6:08 AM GMT
శంత‌న్ పై కామెంట్లు శ్రుతిహాస‌న్ కి అతి పెద్ద జోకులు!
X
శ్రుతిహాస‌న్-డూడుల్ ఆర్టిస్ట్ శంత‌ను హ‌జారికా ప్రేమాయ‌ణం గురించి తెలిసిందే. ఇద్ద‌రు చాలా కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఆ రిలేష‌న్ షిప్ గురించి అధికారికంగా రివీల్ చేయ‌లేదు గానీ....సోష‌ల్ మీడియాలో ఫోటోల సాన్నిహిత్యంతోనే ఇద్ద‌రి మ‌ధ్య బాండింగ్ ఎంత బ‌లంగా ఉంద‌న్న‌ది అద్దం ప‌ట్టేలా చేస్తుంది. ఇటీవ‌లే ఇద్ద‌రు విడిపోయిన‌ట్లు కూడా ప్ర‌చారం సాగింది.

మ‌న‌స్ప‌ర్ధ‌లు త‌లెత్త‌డంతో తాజా రిలేష‌న్ షిప్ కి గుడ్ బై చెప్పిన‌ట్లు అంత‌కంత‌కు మీడియా క‌థ‌నాలు వెడెక్కించాయి. వాటికి పుల్ స్టాప్ పెడుతూ.. శ్రుతి హాస‌న్ శంత‌న్ తో క్లోజ్ గా ఉన్న ఫోటోతో ధీటైన స‌మాధానం ఇచ్చింది. దీంతో అవ‌న్నీ గాలి వార్త‌లుగా తేలిపోయాయి. అయితే ఇలా తేడా జ‌ర‌గ‌డానికి ఓ కార‌ణం కూడా ఉంది. ఇదే సోష‌ల్ మీడియాలో శృతి ఒంట‌రి జీవితం గురించి.. నేను అనే కొత్త పురాణం అందుకోవ‌డంతోనే ఇన్ని ర‌కాల సందేహాలు తెర‌పైకి వ‌చ్చాయి.

ఈ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాలో కామెంట్లు అలాగే ప‌డ్డాయి. తాజాగా శంత‌ను తో త‌న రిలేష‌న్ షిప్ ని రివిల్ చేస్తూ ఆస‌క్తికర వ్యాఖ్య‌ల‌తో పాటు..సోష‌ల్ మీడియా కామెంట్ల‌పై కౌంట‌ర్లు వేసింది. నేను శంత‌ను బెస్ట్ ప్రెండ్స్. ఇద్ద‌రం ఎప్పుడు క‌లిసి ఉంటాం. క‌లిసి కామెంట్లు చ‌దువుతాం. అవి చ‌దివిన‌ప్పుడు కామెడీగా ఉంటుంది. న‌వ్వు ఆపుకోలేము. శంత‌ను వ‌ల్లే ప్ర‌శాంతంగా ఉన్నాను.

ద‌య‌గ‌ల అమ్మాయిగా మారిపోయాను. అత‌నెప్పుడు చాలా ప్ర‌శంతంగా..ద‌యా హృద‌యంతో ఉంటాడు. అందుకే అత‌నంటే అంత ఇష్టం. అత‌న్నిచూసి నేర్చుకోవాల్సింది. తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇంకా చాలానే ఉన్నాయి అంది. ఈ బ్యూటీ తాజా వ్యాఖ్య‌లు నెట్టింట మ‌రోసారి హాట్ టాపిక్ గా మారాయి.

నెటి జ‌నుల అభిప్రాయాలు కామెంట్ల రూపంలో తెలియజేస్తే..అవి జోకులుగా క‌నిపిస్తున్నాయా? అంటూ ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ మండిప‌డుతున్నారు. అలాగే ఆమె స్వీట్ వార్నింగ్ ని హైలైట్ చేస్తున్నారు. శంత‌ను కార‌ణంగా ద‌యాగుణాన్ని..త‌న‌లో యాంగర్ ని త‌గ్గించుకున్న‌ట్లు వ్యాఖ్యానించ‌డాన్ని త‌ప్పు బడుతున్నారు. ఆర‌కంగా శ్రుతిపై నెగివిటీ స్ర్పెడ్ అవుతుంది. మ‌రి వీటికి ఎలాంటి బ‌ధులిస్తుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.