Begin typing your search above and press return to search.
'అమ్మాయిలాగా ఉన్నాడు.. వీడు హీరో ఏంటని కామెంట్స్ చేశారు'
By: Tupaki Desk | 15 May 2021 10:48 AM GMTసిద్ధార్థ్ - త్రిష హీరోహీరోయిన్లుగా సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ ఎమ్మెస్ రాజు తీసిన సినిమా ''నువ్వొస్తానంటే నేనొద్దంటానా''. ఈ సినిమాతో డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా దర్శకుడిగా పరిచయం అయ్యారు. స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం ఘన విజయం సాధించడమే కాకుండా అనేక అవార్డులు రికార్డులు అందుకుంది. 5 నంది అవార్డులు, 9 ఫిలింఫేర్ అవార్డులు, 2 సంతోషం అవార్డులు అందుకున్న ఈ సినిమా ఏకంగా ఆరు భారతీయ భాషలు మరియు రెండు విదేశీ భాషల్లో రీమేక్ కాబడి ఎక్కువ భాషల్లో రీమేక్ అయిన తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా తర్వాత సిద్ధార్థ్ - త్రిష - మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ - డైరెక్టర్ ప్రభుదేవా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. అయితే 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమాలో సిద్ధార్థ్ ని హీరోగా తీసుకున్నందుకు.. ప్రభుదేవా ని డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేయడాన్ని అప్పట్లో చాలామంది వ్యతిరేకించారని నిర్మాత ఎమ్ ఎస్ రాజు చెబుతున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఎమ్మెస్ రాజు ఈ విషయాన్ని వెల్లడించారు. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమాలో సిద్దార్థ్ ని హీరోగా తీసుకోవడాన్ని తమ యూనిట్ లో చాలామంది విమర్శించారని అన్నారు. రైటర్ పరుచూరి వెంకటేశ్వరరావు ఓ వైపు కథ రాస్తూనే 'ఇలాంటి కుర్రాన్ని తెచ్చావేంటయ్యా.. అతనేంటి అతని జుట్టు ఏంటి' అని కామెంట్స్ చేసేవారు అని నిర్మాత తెలిపారు. రిలీజ్ పోస్టర్ చూసి చాలామంది 'వీడేంటి అమ్మాయి లాగా ఆడ పిల్లలాగా ఉన్నాడేంటి' అని కామెంట్స్ చేశారు.. నేను మాత్రం ఫారిన్ నుంచి వచ్చిన కుర్రాడు అలానే ఉండాలి అని ఫిక్స్ అయ్యానని చెప్పారు. ప్రభుదేవాకి డైరెక్షన్ బాధ్యత ఇవ్వడం పట్ల అందరూ నాకు కళ్ళు నెత్తికి ఎక్కాయని.. సక్సెస్ లో ఇన్నాడని ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాడని కామెంట్స్ చేశారు అని ఎమ్ ఎస్ రాజు చెప్పుకొచ్చారు. అయితే 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమా తర్వాత ప్రభుదేవా - సిద్దార్థ్ - త్రిష - దేవిశ్రీ అందరూ టాప్ లెవల్ కి వెళ్లిపోయారు అని ప్రొడ్యూసర్ అన్నారు.