Begin typing your search above and press return to search.
సైరా: కథను కమర్షియల్ చట్రంలో ఇరికించారా?
By: Tupaki Desk | 19 Sep 2019 4:46 AM GMTతెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'సైరా' ట్రైలర్ నిన్న రిలీజ్ అయింది. మరి సినిమాపై ఉన్న అంచనాలను అందుకుందా అంటే దాదాపుగా 'యస్' అనే చెప్పాలి. అయితే ఒక బయోపిక్.. హిస్టారికల్ ఫిలిం పరంగా చూస్తే మాత్రం ట్రైలర్ అంచనాలను అందుకోలేకపోయిందని సోషల్ మీడియాలో చర్చలు సాగుతున్నాయి. దీనికి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్తున్నారు.
ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రను వీలైనంతగా.. ఉన్నదానికి మించి గ్లోరిఫై చెయ్యడం క్లియర్ గా కనిపిస్తోంది. ఒక యోధుడు.. కదనరంగంలో శత్రువులకు వెన్నులో వణుకు తెప్పిస్తాడు తరహాలో ఇంట్రో ఇవ్వడం వరకూ ఒకే కానీ 'కారణ జన్ముడు'.. 'యోగి' అనే పదాలను వాడడం చూస్తే 'ఎన్టీఆర్ బయోపిక్' లో ఎన్టీఆర్ పాత్రను దైవాంశ సంభూతుడిగా చూపించేందుకు చేసిన ప్రయత్నం గుర్తొస్తోందనేది ఒక పాయింట్.
సహజంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలు ఒక కమర్షియల్ ఫార్మాట్ లో సాగుతాయి. ఎలాంటి కథనైనా ఆ కమర్షియల్ పంథాలో అమరేలా చేస్తారు. ఇప్పుడు 'సైరా' ట్రైలర్ చూస్తుంటే ఒక రియల్ హిస్టారికల్ చిత్రంలా కాకుండా కథను కమర్షియల్ చట్రంలో ఇరికించారనే వాదన కూడా విన్పిస్తోంది. ట్రైలర్ లో ఎక్కువగా చూపించిన యాక్షన్ సీక్వెన్సులు.. లాస్ట్ లో ఉన్న కోర్టు సీన్ ఎమోషన్స్ అందుకు ఒక కారణం. దీన్ని సినిమాటిక్ లిబర్టీ అని సరిపెట్టుకోవాలేమో మరి.
ట్రైలర్ చూసినవారు చెప్పే మరో విషయం ఏంటంటే అంచనాలు భారీగా పెంచడం వల్లే ఏమో కానీ ట్రైలర్ లో రిచ్ విజువల్స్.. హై రేంజ్ యాక్షన్ సీక్వెన్సులు కనిపిస్తున్నప్పటికీ అవన్నీ కథకు తగ్గట్టే ఉన్నాయా లేక 'సాహో' తరహాలో యాక్షన్ కోసమని చొప్పించారా అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. చిరు డైలాగ్స్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించవచ్చేమో కానీ సాధారణ ఆడియన్స్ ను ఎగ్జైట్ చేసే తరహాలో అయితే లేవు.. అయన డైలాగ్స్ లో ఇంటెన్సిటీ కంటే కంటే ఫోర్సిబుల్ గా ఉన్నట్టు అనిపిస్తోందనే అంటున్నారు. అయితే ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే కాబట్టి సినిమా రిలీజ్ అయితే కానీ విషయం పూర్తిగా అర్థం కాదు.