Begin typing your search above and press return to search.
బోల్డ్ సీన్స్ - లిప్ లాక్స్ తో నిండిపోయిన 'కమిట్‌మెంట్' ట్రైలర్..!
By: Tupaki Desk | 3 Aug 2022 6:16 AM GMTబిగ్ బాస్ బ్యూటీ, తెలుగమ్మాయి తేజస్వి మదివాడ - అన్వేషి జైన్ - సీమర్ సింగ్ - తనిష్క్ రాజన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ''కమిట్మెంట్''. లవ్ - డ్రీమ్ - హోప్ - ఫైట్ అనేది దీనికి ట్యాగ్ లైన్. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది.
నిజానికి రెండేళ్ల క్రితమే పూర్తైన 'కమిట్మెంట్' సినిమా పాండమిక్ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు అనుకూలించడంతో ఎట్టకేలకు ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఆగస్ట్ 19న ఈ మూవీని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు.
'కమిట్మెంట్' సినిమా పోస్టర్లు టీజర్ అప్పట్లో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఇప్పుడు మేకర్స్ కాస్త డోస్ పెంచారు. బోల్డ్ పోస్టర్స్ తో నెట్టింట రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ ను కూడా ఆవిష్కరించారు.
'అసలు మాలో ఉన్న ఆడతనాన్ని చూసి మీరు మనుషులన్న సంగతే మర్చిపోతున్నారు.. కాస్త మనుషుల్లా ఆలోచించండి' అనే డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. అక్కడి నుంచి ట్రైలర్ అంతా హాట్ రొమాంటిక్ సీన్స్ - గాఢమైన లిప్ లాక్స్ - బూతు డైలాగ్స్ తో నిండిపోయింది.
ఇందులో హాట్ ఫోటో షూట్స్ తో అవకాశాల కోసం ట్రై చేస్తున్న అప్ కమింగ్ యాక్ట్రెస్ గా తేజస్వి ని పరిచయం చేసారు. 'మన మాటలు మత్తుగా ఉండాలి.. మనం హాట్ గా ఉండాలి' అంటూ అన్వేషి జైన్ ను ఒక సెక్సాలజిస్టుగా చూపించారు. అలానే హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకునే ఒక టీనేజ్ గర్ల్ - ప్రేమలో మినిగితేలుతున్న ఓ స్టూడెంట్ మరియు ఐసీయూలోకి వెళ్లాలని ఆశ పడే ఒక లేడీ జూనియర్ డాక్టర్ పాత్రలను ఈ ట్రైలర్ చూపిస్తుంది.
ఇలా ఐదుగురు అమ్మాయిల జీవితంలో జరిగిన సంఘనటల సమాహారంగా ఈ ట్రైలర్ ను కట్ చేశారు. టైటిల్ కు తగ్గట్టుగానే కమిట్మెంట్ చుట్టూనే కథంతా నడుస్తుందని అర్థం అవుతుంది. ఇందులో అమిత్ తివారి - రాజా రవీంద్ర కీలక పాత్రల్లో నటించారు. సినీ ఇండస్ట్రీలో నటీమణులపై లైంగిక వేధింపులతో పాటు పలు రంగాల్లో మహిళలపై చోటుచేసుకొంటున్న వేధింపులే కథాంశంగా 'కమిట్మెంట్' చిత్రాన్ని తెరకెక్కించారని తెలుస్తోంది.
'వాడి పక్కన పడుకోడానికి మనం రోడ్డు మీద కనిపించే కుక్కలం కాదు.. మొగాడు ఎట్లైనా బ్రతుకుతాడు.. కానీ ఆడది యుద్ధం చేస్తేనే బ్రతుకుతుంది' అనే డైలాగ్ ఈ సినిమా మెయిన్ ప్లాట్ ను తెలియజేస్తుంది. ఇందులో ఒక డైలాగ్ లో 'బట్ట' అనే కొన్ని ఏరియాల్లో వాడే అసభ్యకరమైన పదాన్ని కూడా ఉపయోగించారు.
నిజానికి కొన్ని రోజుల ముందు ఓ ట్రైలర్ ను లాంచ్ చేయగా వివాదాస్పదమైంది. అశ్లీల సన్నివేశాలు చూపిస్తుండగా వెనక ‘మురికి చేత అద్దము.. మావిచేత శిశువు యెట్లు కప్పబడునో.. అట్లు కామము చేత జ్ఞానము కప్పబడి యున్నది’ అంటూ భగవద్గీత ప్రవచనం వినిపించడం పై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.
బూతు సన్నివేశాలకు భగవద్గీత ప్రవచనాలు యాడ్ చేసారంటూ నెటిజన్లు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా సరికొత్త బోల్డ్ అండ్ రొమాంటిక్ ట్రైలర్ తో ముందుకు వచ్చారు. మరి ఈ అంశాలను చూసి ఎంతమంది థియేటర్లకు వెళ్తారో చూడాలి.
''కమిట్ మెంట్'' చిత్రానికి 'హైదరాబాద్ నవాబ్స్' ఫేమ్ లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వం వహించారు. ఫుట్ లూస్ ఎంటర్టైన్మెంట్స్ మరియు ఎఫ్3 ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై భల్ దేవ్ సింగ్ - నీలిమ నిర్మించారు. నరేష్ కుమారన్ సంగీతం సమకూర్చగా.. సజీష్ రాజేంద్రన్ - నరేష్ రానా సినిమాటోగ్రఫీ నిర్వహించారు.