Begin typing your search above and press return to search.

900మందిని సూసైడ్ కి క‌మిట్ చేయించాడు!-ఆర్జీవీ

By:  Tupaki Desk   |   7 Feb 2022 5:37 AM GMT
900మందిని సూసైడ్ కి క‌మిట్ చేయించాడు!-ఆర్జీవీ
X
మ‌నిషి న‌మ్మ‌కానికి వాస్త‌వానికి మ‌ధ్య ఉండే తేడా ఏంటో ఆర్జీవీ గొప్ప‌గా చెప్పారు. క‌నిపించేదానిని న‌మ్మ‌డం ఒకెత్తు. క‌నిపించ‌ని దైవాన్ని న‌మ్మ‌డం ఇంకో ఎత్తు. మనిషి మెద‌డులో ఆ క్ష‌ణం ఏది మెదిలితే అదే న‌మ్మ‌కం.. అదే నిజం.

తిరుప‌తి క్యూలైన్ లో నుంచొనే భ‌క్తుడు తన న‌మ్మ‌కాన్ని గెలిపించుకుంటున్నాడు. దైవాన్ని న‌మ్ముతున్నాడు. న‌మ్మ‌నివాళ్లు వెళ్ల‌రు. ఇక సైన్స్ కూడా ప్ర‌తిసారీ నిజం చెప్ప‌దు. ఒక‌సారి నిరూప‌ణ అయిన‌ది రేపు త‌ప్పు అని కూడా చెబుతుంటారు సైంటిస్టులు. ప‌రిశోధ‌న‌లు సాగించే క్ర‌మంలోనే కొన్ని సిద్ధాంతాలు ప్ర‌తిపాదిస్తారు.. అంటూ ఆర్జీవీ త‌న‌దైన శైలిలో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ స్వ‌ప్న‌తో ఇంట‌ర్వ్యూలో విశ్లేషించిన తీరు ఆక‌ట్టుకుంది.

ఒక‌డు 900 మందిని సూసైడ్ కి క‌మిట్ చేయించాడు! అంటే అత‌డిని ఎంత‌గా జ‌నం న‌మ్మారో అర్థం చేసుకోవాలి. అది మ‌త‌ప‌ర‌మైన న‌మ్మ‌కం కావొచ్చు.. లేదా భ‌క్తి త‌త్వానికి సంబంధించిన‌ది అయినా కావొచ్చు. లైక్ మైండెడ్ పీపుల్ ఒక‌దానిని న‌మ్ముతారు. అత‌డు అలాంటి వారంద‌రినీ ఆత్మ‌హ‌త్య‌కు ప్రేరేపించాడు. అది వాడి స‌త్తా!! అంటూ ఎంతో అందంగా ఆ పైశాచిక‌త్వాన్ని కూడా ఆర్జీవీ వ‌ర్ణించారు.

ఆర్జీవీ తెర‌కెక్కించిన చాలా సినిమాలు రిలీజ‌వుతాయా? అంటే అది ఆయ‌న న‌మ్మ‌కం. కానీ రిలీజ్ కావు అని న‌మ్మితే అది ఎదుటివారి న‌మ్మ‌కం. కానీ త‌న సినిమాల రిలీజ్ తేదీల‌పై ఆర్జీవీ ఎందుక‌ని క్లారిటీ ఇవ్వ‌రో!! అన‌వ‌స‌ర‌ హంగామా హ‌డావుడి త‌ప్ప‌!!