Begin typing your search above and press return to search.
వంగవీటిపై జనాలు ఏమంటున్నారంటే
By: Tupaki Desk | 23 Dec 2016 4:44 PM GMTసంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన సెన్సేషనల్ మూవీ వంగవీటి. ఇలా ఓ టైటిల్ తో రియల్ లైఫ్ కేరక్టర్లతో సినిమా తీయడమే పెద్ద సెన్సేషన్. ఇప్పుడా సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. క్రైమ్ మీద పెట్టిన కాన్సంట్రేషన్ కేరక్టర్ల మీద పెట్టలేదంటూ రివ్యూలు వచ్చాయి. మరి ఈ సినిమా గురించి జనాలు ఏమనుకుంటన్నారో తెలుసుకుందాం.
సినిమా చూసిన చాలా మంది రామ్ గోపాల్ వర్మ ఈజ్ బ్యాక్ అనే పాయింట్ ను ఎక్కువగా చెబుతున్నారు. వర్మ నుంచి ఇలాంటి ఇంటెన్సిటీ ఉన్న సబ్జెక్ట్ తో సినిమా వచ్చి చాలా కాలం అవడమే ఇందుకు కారణం. అయితే.. సినిమా అద్భుతంగా ఉందని చెప్పేవాళ్ల కంటే.. యావరేజ్ అంటున్నవారే ఎక్కువగా కనిపిస్తున్నారు. అసలు వంగవీటికి అనే మూవీకి మూలం వంగవీటి రంగా అయితే.. రంగా కేరక్టర్ ను సరిగా చూపించలేదనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
మరోవైపు ఆకాలం నాటి వాస్తవాలను దాదాపుగా అలాగే చూపించినందుకు మాత్రం అభినందనలు వస్తున్నాయి. అన్నిటి కంటే ముఖ్యంగా.. వంగవీటి మూవీలో కేరక్టర్ల కోసం ఆయా నటులను ఎంచుకున్న తీరుని మాత్రం అందరూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. నిజంగా రియల్ లైఫ్ లో చూసినట్లుగానే అనిపిస్తోందనే టాక్ వచ్చింది. పబ్లిక్ టాక్ వింటుంటే అన్ని యాంగిల్స్ లోను కాకపోయినా.. వంగవీటి విషయంలో వర్మ కొంతమేరకు సక్సెస్ అయ్యాడనే అనిపించకమానదు.