Begin typing your search above and press return to search.
సూర్యకు థియేటర్ల సంఘం స్ట్రాంగ్ వార్నింగ్...!
By: Tupaki Desk | 25 April 2020 3:01 PM GMTప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో సినిమా షూటింగులు.. సినిమా రిలీజ్ లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. థియేటర్స్ పూర్తిగా మూసేయడంతో డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్, థియేటర్స్ నిర్వాహకులు తీవ్ర గడ్డుకాలాన్ని ఎదర్కొంటున్నారు. సినిమాల కోసం ఫైనాన్సియర్ల దగ్గర డబ్బులు తీసుకున్న కొందరు చిన్న నిర్మాతలు వడ్డీలు భరించలేక డైరెక్ట్ గా ఓటీటీ రిలీజ్ చేయడమే శరణ్యమని భావిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన సినిమాలను ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ద్వారా రిలీజ్ చేయాలని కొందరు నిర్మాతలు అనుకుంటున్నారు. ఈ లాక్ డౌన్ సిచ్యుయేషన్ క్యాష్ చేసుకోవాలని చూస్తున్న అమేజాన్ ప్రైమ్, నెటిఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ క్రేజ్ ఉన్న సినిమాలకు అధిక మొత్తం చెల్లించడానికి ముందుకొస్తున్నాయి.
ఈ నేపథ్యంలో జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన 'పొన్మగల్ వంధాల్' అనే సినిమాను డైరెక్ట్ గా ఓటీటీ రిలీజ్ చేయాలని భావించారు. ఈ చిత్రాన్ని నిర్మించిన హీరో సూర్య ఈ సినిమాను నేరుగా అమేజాన్ ప్రైమ్ లో విడుదల చేయాలని అనుకున్నారు. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ తో ఓ ఒప్పందం కుదుర్చుకోవడం కూడా జరిగిందట. అయితే ఇప్పుడు సూర్య నిర్ణయాన్ని తమిళనాడు థియేటర్స్ యాజమాన్య సంఘం ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటువంటి చర్యల వల్ల థియేటర్స్ పూర్తిగా మూసివేసే పరిస్థితి వస్తుందని.. తమను రోడ్డు మీద పడేసే చర్యలు మానుకోవాలని థియేటర్ ఓనర్స్ సూచిస్తున్నారు.
అంతేకాకుండా హీరో సూర్యను హెచ్చరిస్తూ తమిళనాడు థియేటర్స్ యాజమాన్య సంఘం ప్రధాన కార్యదర్శి పన్నీర్ సెల్వం ఓ వీడియో సందేశం కూడా పంపడం జరిగింది. ఈ వీడియోలో 'సినిమాలను పూర్తిగా థియేటర్లను దృష్టిలో ఉంచుకునే తెరకెక్కిస్తారు. సూర్య నిర్మించిన 'పొన్మగల్ వంధాల్’ డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కావడాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. ఓటీటీలో విడుదల చేయాలనే నిర్ణయాన్ని సూర్య వెనక్కి తీసుకోవాలి. ఒకవేళ తమను పట్టించుకోకుండా డిజిటల్ ఓటీటీ ద్వారా సినిమాలు విడుదల చేస్తే.. సూర్య నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చే చిత్రాలతో పాటు.. సూర్య, జ్యోతిక నటించే సినిమాలు కూడా మేము నిషేధిస్తామని' పన్నీర్ సెల్వం పేర్కొన్నారు.