Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ నానిల పోటీ కరెక్టేనా?
By: Tupaki Desk | 1 Oct 2018 6:46 AM GMTమొత్తానికి బిగ్ బాస్ సీజన్ 2 దిగ్విజయయంగా పూర్తయ్యింది. పాజిటివ్ గా నెగటివ్ గా రెండు రకాలుగా అటు ప్రేక్షకుల్లోనూ ఇటు మీడియాలోనూ సమానమైన స్పందన తెచ్చుకున్న ఈ షో మీద ప్రారంభానికి ముందు ఆసక్తి రేపింది నాని యాంకరింగ్. ఫస్ట్ సీజన్ జూనియర్ ఎన్టీఆర్ చేసాడు కాబట్టి తనను మరిపించేలా నాని ఎలా చేస్తాడా అనే ఆసక్తి విపరీతంగా నెలకొంది. దీంతో సహజంగానే పోలికలు రావడం మొదలయ్యాయి. కొందరు ఎన్టీఆర్ బాగా చేసాడు అని గుర్తు చేసుకోగా కొందరు నాని టైమింగ్ తో నిలబెట్టాడు అని ప్రశంశలు అందించారు.
పార్టిసిపెంట్స్ విషయంలో నాని స్పందించిన తీరుకు సోషల్ మీడియాలో ట్రాలింగ్ జరగడం ఒకదశలో అతన్ని సైతం ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. మరి ఎన్టీఆర్ నానిలలో ఎవరు బాగా చేసారు అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. నిజానికి ఇలా పోలిక పెట్టడం కరెక్ట్ కాదు. ఇలాంటి షోలు విజయవంతం కావడం కాకపోవడం వెనుక చాలా కారణాలు ఉంటాయి. కేవలం యాంకర్ ను ఆధారంగా చేసుకుని ప్రోగ్రామ్స్ కు రేటింగ్స్ వస్తాయని చెప్పడం సరికాదు.
గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాంని నాగార్జున నుంచి తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఇండస్ట్రీలో నెంబర్ వన్ గా ఉన్న చిరంజీవి అంతటివారే పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయారు. దాని కారణాలు ఇక్కడ అప్రస్తుతం. నాని హోస్ట్ చేసే టైంకి బిగ్ బాస్ షో గురించి తెలుగు ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పైగా మొదలుకాకుండానే లీకైన లిస్ట్ ద్వారా పేర్లు బయటికి రావడంతో వీళ్ళేం సెలెబ్రిటీలు అనే చర్చ కూడా జోరుగ్గా సాగింది.సహజంగానే ఇది రేటింగ్స్ మీద ప్రభావం చూపింది. దాంతో వ్యూయర్స్ దృష్టి మొత్తం నాని మీదకు వెళ్లిపోయింది. మొదటిసారి కొంత ఒత్తిడి ఫీలైనా తక్కువ టైంలోనే నాని తనలోనే టైమింగ్ నటుడిని బయటికి తీసుకొచ్చి రక్తి కట్టించడం మొదలుపెట్టాడు.
ఇక్కడ మరొక విషయం మర్చిపోకూడదు. యాంకరింగ్ తన నియంత్రణలో ఉంటుంది కానీ హౌస్ లో జరిగే పరిణామాల మీద నాని కంట్రోల్ ఉండదు. అతనికి సంబంధం లేదు కూడా. కానీ చాలా వారాలు వీక్ డేస్ లో షో డ్రై గా రన్ కావడంతో వాటికి బూస్ట్ ఇచ్చేలా చేయడం నానికి తొలుత కష్టంగా మారింది. అయినా మెల్లగా దానికి అలవాటు పడి ప్రేక్షకులు తనకు ట్యూన్ అయ్యేలా చేసుకున్నాడు . నాని లోపాలు మైనస్ లు లేకపోలేదు. షూటింగ్స్ లో ఉన్న ఒత్తిడి వల్ల సరైన ప్రిపరేషన్ లేకుండా హౌస్ లో ఏం జరిగింది అనేది పూర్తిగా చూసుకోకుండా స్క్రిప్ట్ లో హై లైట్స్ చదివి నేరుగా సెట్ కు వచ్చేవారన్న కామెంట్స్ కు బలమిచ్చేలా నాని కొన్నిసార్లు మమ అనిపించేలా వ్యవహరించడం ప్రేక్షకుల దృష్టి నుంచి తప్పించుకోలేదు. అది నిజమా కాదా అని చెప్పలేం కానీ నాని చేసిన అలాంటి కొన్ని పొరపాట్లు మినహాయిస్తే నానిని పోలిక ప్రకారంగా వేరు చేసి చూడలేం.
ఏ హీరోకైనా యూనీక్ టాలెంట్ అనేది వేరు వేరుగా ఉంటుంది. వాళ్లకు నప్పిన పాత్రలు వచ్చినపుడే వాళ్లేంటో చెలరేగిపోయి చూపిస్తారు. యమదొంగలో నానిని ఊహించుకోగలమా. నిన్ను కోరిలో జూనియర్ ఎన్టీఆర్ ని రీ ప్లేస్ చేసి చూడండి. ఆ ఊహలే విచిత్రంగా అనిపిస్తాయి. బిగ్ బాస్ ఇలా పోలిక పెట్టేది కాదు కాబట్టి విడివిడిగా విశ్లేషించాల్సిందే. ఆ మాటకొస్తే హిందీలో సల్మాన్ ఖాన్ తమిళ్ లో కమల్ హాసన్ మలయాళంలో మోహన్ లాల్ వీళ్ళలో పోలిక పెడితే ఎలా ఉంటుంది. ఎవరిది వారే యమునా తీరే. సో నానికి షో వల్ల వచ్చిన లాభమేమో కానీ నష్టమైతే లేదు. ఒక మంచి అనుభవం తోడయ్యింది. అంతే.