Begin typing your search above and press return to search.
విజయ్ దేవరకొండకు - ధృవకు అదే తేడా..
By: Tupaki Desk | 23 Sep 2018 1:30 PM GMTతెలుగులో అర్జున్ రెడ్డి పాత్రలో విజయ్ దేవరకొండ జీవించేశాడు. అతడిని చూశాక ఇక ఎవ్వరూ గుర్తుకు రాని పరిస్థితిని కల్పించాడు. స్టార్ హీరోలకు కూడా సాధ్యం కాని రీతిలో పాత్రకు ప్రాణం పోశాడు. అందుకే ఆ మూవీ తెలుగులో సంచలనం సృష్టించింది. రికార్డులు తిరగరాసింది. క్యారెక్టరైజేషన్ విషయంలో నాడు శివ ట్రెండ్ సెట్టర్ అయితే ఇప్పుడు అర్జున్ రెడ్డి అంతకుమించిన మైలురాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే కోట్లు పోసి మరీ ఈ కథను తమిళం, హిందీ వాసులు కొని రిమేక్ చేస్తున్నారు.
తాజాగా తమిళంలో విక్రమ్ కొడుకు ధృవ్ హీరోగా ఈ మూవీని తీశారు. ‘వర్మ’ పేరుతో విడుదలైన ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. స్వతహాగానే అర్జున్ రెడ్డిలో విజయ్ ను చూసిన జనాలకు ధృవ నాసిరకం ఎక్స్ ప్రెషన్స్, పొసగని క్యారెక్టరైజేషన్ పై పెదవి విరుస్తున్నారు. ఇక్కడి నుంచి తమిళంలోకి వెళ్లడంతో దీనిపై తెలుగు జనాలందరూ ఆసక్తి కనబరిచారు. టీజర్ చూశాక మాత్రం ఇప్పుడు నెటిజన్లు, ప్రేక్షకులు బిక్కమొహం వేశారు. అర్జున్ రెడ్డి ఇంపాక్ట్ ‘వర్మ’ లేదంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
తమిళ ట్రైలర్ ‘వర్మ’లో కొన్ని సీరియస్ హావభావాలు కూడా కామెడీగా అనిపిస్తున్నాయని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అంతేకాదు కొందరు విజయ్ ను పోల్చుతూ ట్రోలింగ్ లు కూడా మొదలుపెట్టారు. అర్జున్ రెడ్డికి ఇది కామెడీ వెర్షన్ అంటూ ఆట పట్టిస్తున్నారు. దృవకి గెడ్డం కూడా ఏమాత్రం సూటవ్వలేదంటూ దెప్పి పొడుస్తున్నారు. టీజర్ చూస్తే మక్కీకి మక్కి అర్జున్ రెడ్డిని దించినా.. విజయ్ సృష్టించిన నటన, ఎక్స్ ప్రెషన్స్ కరువయ్యాయని ఆడిపోసుకుంటున్నారు. మరి ట్రైలర్ కే తెలుగు జనాలు పెదవి విరిస్తే ఫుల్ మూవీ చూస్తే ఏమంటారో చూడాలి మరి..