Begin typing your search above and press return to search.

నత్తి పట్టుకుని కాపీ అంటే ఎలా?

By:  Tupaki Desk   |   11 July 2017 12:51 PM GMT
నత్తి పట్టుకుని కాపీ అంటే ఎలా?
X
వరస హిట్ సినిమాలతో జోష్ మీదున్న ఎన్టీఆర్ కొత్త సినిమా ‘జై లవ కుశ’ దసరాకి విడుదల కాబోతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ చేసిన విలన్ పాత్రను జై ను ప్రేక్షకులకు పరిచయం చేశారు కూడా. సినిమాలో ఈ పాత్ర ఎంత భయానకంగా ఉండబోతుందో మనకు చెప్పకనే చెప్పారు. జై పాత్రకు ఊపిరి సరిగా తీసుకోలేని జబ్బు ఉంటుందిట. అందుకే ఎన్టీఆర్ కొంచెం నత్తిగా మాట్లాడుతాడట.

డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ఇటువంటి పాత్ర లక్షణాలు ఉన్న విలన్ పాత్రను చెప్పాడని.. దాన్ని ఎన్టీఆర్.. జై లవ కుశలో వాడేశాడనే రూమర్ గట్టిగానే వినిపిస్తోంది. గతంలో త్రివిక్రమ్ కూడా ఇలానే చేశాడు, ఒక ఫేమస్ ఇంగ్లిష్ సినిమా విలన్ పాత్రలో కొన్ని లక్షణాలను.. ‘జులాయి’లో సోనూ సూద్ పాత్రగా మార్చి హిట్ కొట్టాడు. ఆ సినిమాలో సోనూ సూద్ కు నత్తి ఉంటుంది. ఇక మన సినిమాల్లో సాధరణంగా రావణ - దుర్యోధన లక్షణాలు ఉన్న పాత్రలు విలన్ గా రాస్తారు. ఇప్పుడు వస్తున్న ‘జై లవ కుశ’ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర యాస, కట్టు, నడత అన్నీ కొత్తగానే ఉన్నాయి. తెలంగాణలో ఉన్న ఒక ముస్లిం తెలుగులా మాట్లాడి కొంచం నత్తి ఉన్నట్లు కనిపించాడు. ఈ నత్తి పూరీ జగన్ రాసిన పాత్రలో లాగా ఉందని.. ఆయన టీమ్ అభిప్రాయపడుతున్నారు. పోనీ ఎన్టీఆర్ దాన్ని తీసుకున్నాడు అనుకున్నా.. ఇక్కడ ఎన్టీఆర్ దాన్ని తెలివిగా వాడాడనే చెప్పాలి.

అయినా.. ఇలా ఒక పాత్ర కారణంగా సినిమాలు హిట్ కావు కదా. సినిమా హిట్ అయితే ఆ రోల్ పాపులర్ అవుతుందంతే. స్టోరీ లేకుండా విలన్ రోల్ ని గొప్పగా చూపించిన మాత్రాన పెద్దగా ప్రయోజనం ఉండదు కదా. ఏదేమైనా.. ఈ నత్తి టాపిక్ మరీ అంతా పెద్ద విషయంలా కనిపించటం లేదు. కాబట్టి అభిమానులు పెద్దగా ఆందోళన పడాల్సిన పని లేదేమో!