Begin typing your search above and press return to search.
`బెల్ బాటమ్`తో `టక్ జగదీష్` పోలికేమిటి?
By: Tupaki Desk | 13 Sep 2021 1:33 PM GMTబాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించిన `బెల్ బాటమ్` ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. సరిగ్గా కరోనా సెకెండ్ తగ్గుముఖం పట్టిన తరుణంలో హీరోలు నేరుగా థియేటర్లోకి రావడానికి సంకోచిస్తోన్న సమయంలో అక్షయ్ బెల్ బాటమ్ డేర్ చేసి థియేటర్లో రిలీజ్ చేశారు. కానీ సినిమా కు కొన్ని పాజిటివ్ రివ్యూలున్నా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ రాలేదు. తొలి రోజే జనం లేక సినిమా బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. కొన్ని మిక్స్ డ్ రివ్యూలు వచ్చాయి. దీంతో వసూళ్లు అంతకంతకు పడిపోయాయి. అసలే కరోనా దెబ్బకు జనాలు థియేటర్లకు రావడం లేదు. దీంతో అక్షయ్ కెరీర్ లోనే లీస్ట్ వసూళ్లు తెచ్చిన తొలి చిత్రంగా నిలిచిపోయింది.
ఆ రకంగా థియేటర్లో రిలీజ్ అయి `బెల్ బాటమ్` దెబ్బ అయిపోయింది. ఇప్పుడీ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 16 నుంచి స్ర్టీమింగ్ అవ్వడానికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఓటీటీ ప్రేక్షకులు చూడటానికి ఎంత మాత్రం ఆసక్తి చూపించడం లేదని టాక్ వినిపిస్తోంది. ఆడియన్స్ సినిమాపై ఎంత మాత్రం ఎగ్జైట్ మెంట్ చూపించడం లేదని తెలుస్తోంది. థియేటర్ రిలీజ్ తో నెగిటివ్ టాక్ రావడంతో ఓటీటీలో ఇలా రిలీజ్ కి ముందే చతికిల పడిపోయింది. ముందుగా థియేటర్లో రిలీజ్ అయి..అక్కడ తేడా కొట్టి ఓటీటీలోకి వస్తే ఏ సినిమాకైనా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో `బెల్ బాటమ్` ని ఓ గుణపాఠంగా చెప్పొచ్చు.
ఇదే సినిమా ముందుగా ఓటీటీలో రిలీజ్ అయి ఉంటే కనీసం సినిమా కొంత ప్రాఫిట్ తోనైనా సేఫ్ జోన్ లో ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే సుఖమేమి అన్న చందంగా తయారైంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నిర్మాతలు ఇప్పుడున్న పరిస్థితుల్ని బేరీజు వేసుకుని..సినిమా ఔట్ పుట్ ని నిశితంగా పరిశీలించి థియేటర్ కన్నా ముందుగానే ఓటీటీకి వెళ్లిపోతేనే బెటర్ అనే ఛాయిస్ ని తీసుకునే అవకాశం కనిపిస్తోంది. నేచురల్ స్టార్ నాని నటించిన `టక్ జగదీష్` రిలీజ్ విషయంలో తలెత్తిన హైడ్రామా గురించి తెలిసిందే. థియేటర్ రిలీజ్ నా? ఓటీటీ రిలీజ్ నా? అన్న సందేహం నడుమ ముందుగా ఓటీటీలోనే రిలీజ్ అయి సేఫ్ జోన్ లో పడింది. లేదంటే `టక్ జగదీష్` కూడా మరో `బెల్ బాటమ్` అయ్యేది.