Begin typing your search above and press return to search.
అక్కినేని `ప్రేమనగర్`తో `లవ్ స్టోరి` పోలిక?
By: Tupaki Desk | 14 Sep 2021 5:30 AM GMT24 సెప్టెంబర్ 1971 అక్కినేని నాగేశ్వరరావు నటించిన ప్రేమనగర్ రిలీజ్ తేదీ. యాథృచ్ఛకంగానే ఇదే తేదీని నాగచైతన్య లవ్ స్టోరి కోసం లాక్ చేయడం అభిమానుల్లో చర్చనీయాంశమైంది. సెకండ్ వేవ్ అనంతరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న `లవ్ స్టోరీ` రిలీజ్ కి సిద్ధమవుతున్న వేళ ఇది హాట్ డిబేట్ గా మారింది.
ఇటీవల లవ్ స్టోరి ట్రైలర్ విడుదలైంది. దీనికి మంచి స్పందన లభిస్తోంది. శేఖర్ కమ్ముల మ్యాజిక్ ట్రైలర్ ఆద్యంతం వర్కవుటైంది. లీడ్ పెయిర్ నాగ చైతన్య - సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ ట్రైలర్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అలాగే సాయిపల్లవి డ్యాన్సుల దుమారం ట్రైలర్ ని మరో లెవల్ కి చేర్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
#ప్రేమ కథ బాగుంది రా చై!! ఆల్ ది బెస్ట్ !! అంటూ కింగ్ నాగార్జున ట్వీట్ ప్రోత్సాహం అందించి షేర్ చేసిన ఓ పోస్టర్ చాలా మందిని ఆకట్టుకుంది. టాలీవుడ్ ఆల్ టైమ్ క్లాసిక్ `ప్రేమనగర్`తో పోలుస్తూ రిలీజ్ చేసిన పోస్టర్. యాధృచ్ఛికంగా `లవ్ స్టోరీ` దాదాపు 50 సంవత్సరాల క్రితం విడుదలైన `ప్రేమ్ నగర్` అదే తేదీన అంటే సెప్టెంబర్ 24 న విడుదలవుతోంది. పోస్టర్ కు అక్కినేని అభిమానుల నుండి లైక్ లు హోరెత్తుతున్నాయి. ట్రైలర్ ఫీలర్స్ ప్రకారం.. లవ్ స్టోరి కూడా కల్ట్ క్లాసిక్ జానర్ లో అందరి మనసులు దోచేసి పెద్ద విజయం దక్కించుకుంటుందని అంచనా ఏర్పడింది. లవ్ స్టోరీ శేఖర్ కమ్ముల బ్రాండ్ మూవీ. అందువల్ల యువతరంలో మంచి క్రేజ్ ఉంది. విజయంపై చిత్రబృందం చాలా ధీమాగా ఉంది.
ఇక ఇటీవల విడుదలైన సినిమాలన్నీ మంచి టాక్ తెచ్చుకున్నా కరోనా భయాల నడుమ జనాల్ని థియేటర్లకు రప్పించలేకపోయాయి. గోపిచంద్ సీటీమార్ మాస్ ని థియేటర్లకు రప్పించింది. ఇప్పుడు చైతన్య లవ్ స్టోరి మాస్ క్లాస్ అందరినీ థియేటర్లకు లాగాల్సి ఉంటుంది. ఇది నిజంగానే లవ్ స్టోరీకి బిగ్ ఛాలెంజింగ్ టైమ్ అని చెప్పాలి.
మూవీ మొఘల్ ని నిలబెట్టిన క్లాసిక్ ప్రేమనగర్ !
అక్కినేని నాగేశ్వరరావు నటించిన `ప్రేమనగర్` 1971లో విడుదలైంది. ప్రఖ్యాత రచయిత్రి అరికెపూడి కౌసల్యాదేవి (కోడూరి కౌసల్యాదేవి) రాసిన నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అత్యంత విజయనంతమైన తెలుగు నవలాచిత్రాలలో ఇది ఒకటి. అంతకు ముందు కొన్ని సినిమాలలో నష్టాలనెదుర్కొన్న మూవీ మొఘల్ డా. డి.రామానాయుడు ఈ సినిమాతో నిర్మాతగా సినీరంగంలో నిలదొక్కుకున్నాడు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తమిళం.. హిందీలలో కూడా పునర్నిర్మించారు.
కళ్యాణ్ (అక్కినేని) అనే జమీందారు కొడుకు విలాసనంతమైన జీవితానికి దురలవాట్లకు బానిసవుతాడు. ఎయిర్-హోస్టెస్ గా పరిచయమైన లత (వాణిశ్రీ) వారింట్లో సెక్రటరీగా చేరుతుంది. అభిమానవతి అయిన ఆమె క్రమంగా కళ్యాణ్ ను నిలకడైన జీవనవిధానంవైపు మళ్ళిస్తుంది. ఆమెపట్ల ఆకర్షితుడైన కళ్యాణ్ ఆమెను వివాహం చేసుకోవాలనుకోగా కుటుంబంనుండి ప్రతిఘటన ఎదురవుతుంది. అలా విడిపోయిన వారు తిరిగి కలుసుకొంటారు. ఈ మధ్యలో సంఘర్షణ ఏమిటి.. చివరికి ఈ ప్రేమకథలో ట్విస్టేమిటి? అన్నది తెరపైనే చూడాలి. తెలుగు ఆడియెన్ ని కంటికి కునుకు లేకుండా చేసిన చిత్రమిది. మహిళా అభిమానులు అక్కినేనిని గొప్పగా ఆరాధించేలా చేసిన చిత్రంగా రికార్డులకెక్కింది. ఇప్పుడు మళ్లీ లవ్ స్టోరితో అక్కినేని మనవడు నాగచైతన్య ఆ ఫీట్ ని రిపీట్ చేస్తారేమో చూడాలి.