Begin typing your search above and press return to search.
బాహుబలి బలంలో సగం కూడా లేని చిట్టి
By: Tupaki Desk | 27 Nov 2018 12:12 PM GMTఇంకో నలభై గంటలు ఎప్పుడెప్పుడు గడుస్తాయా అని ఎదురు చూస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. గత కోనేళ్ళుగా హిట్టు లేక కొన్న ప్రతి సినిమా బయ్యర్లను నష్టాలపాలు చేస్తున్న తరుణంలో శంకర్ అండగా విజువల్ ఎఫెక్ట్స్ సహాయంతో తలైవా అదిరిపోయే హిట్ కొట్టాలని అభిమానులు తమిళనాడులో గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు. కాని తెలుగులో మాత్రం పరిస్థితి దానికి కొంత భిన్నంగా ఉంది. హైప్ తో పాటు అడ్వాన్సు బుకింగ్స్ బాగానే ఉన్నాయి కాని అవి గురువారం వరకే కనిపిస్తున్నాయి.
అదిరిపోయింది అనే టాక్ వస్తే ఆపై అడ్డుఅదుపు ఉండదు కాని ఏ మాత్రం తేడా వచ్చినా ఫలితం ఇంకోలా ఉంటుంది. దానికి తోడు బాహుబలి కొట్టే సినిమా 2.0నే అని చెన్నై మీడియా తెగ ఊదరగొడుతోంది. శంకర్ టీమ్ మాత్రం ఆ ప్రస్తావనే రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. హైప్ పరంగా చూసుకున్న జనంలో నెలకొన్న క్రేజ్ లెక్కన చూసుకున్నా 2.0 బాహుబలి దరిదాపుల్లో కూడా లేదన్నది వాస్తవం. బాహుబలికి ముందు చూసుకున్నా లేదా బాహుబలి 2 విడుదల సమయంలో ఏర్పడ్డ క్రేజ్ గుర్తుకు చేసుకున్నా అప్పుడు ఏ నోట విన్నా దీని గురించిన చర్చ ఉండేది. ట్రైలర్ సైతం చాలా ప్రామిసింగ్ గా ఉండటంతో జనం థియేటర్లకు పోటెత్తారు. ఇక మౌత్ టాక్ సంగతి సరేసరి. అందుకే ఐదు వందల కోట్లు దాటడం కేక్ వాక్ లాగా అనిపించింది.
కానీ 2.0 ట్రైలర్ కు కానీ ప్రమోషన్ కు కానీ అంత రెస్పాన్స్ కనిపించడం లేదు. పోస్టర్లు సైతం చాలా మాములుగా ఉన్నాయి. మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ అయితే జోరుగా ఉన్నాయి కానీ హైదరాబాద్ విషయానికి వస్తే మూడో రోజు నుంచే టికెట్లు ఈజీగా అందుబాటులో ఉన్నాయి. హిట్ టాక్ వస్తే వాటికి నిమిషాల్లో సోల్డ్ అవుట్ మార్క్ పడిపోతుంది కానీ టాక్ మీదే అది ఆధారపడి ఉంటుంది. తెలంగాణలో ఛాన్స్ లేదు కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం తెల్లవారుఝామున బెనిఫిట్ షోలకు అనుమతులు వచ్చినట్టు సమాచారం. మరికొద్ది గంటల్లో ఖరారు కావొచ్చు.