Begin typing your search above and press return to search.

అవార్డు కోసం పోటీ ఆ రెండింటి మధ్యే ?

By:  Tupaki Desk   |   19 April 2019 10:12 AM IST
అవార్డు కోసం పోటీ ఆ రెండింటి మధ్యే ?
X
త్వరలో సినిమాలకు సంబంధించి జాతీయ అవార్డుల ప్రకటన రాబోతోంది. ఈసారి మన నిర్మాతలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ముఖ్యంగా మహానటి-రంగస్థలం మధ్యే పోటీ ఎక్కువగా ఉందని ఇన్ సైడ్ టాక్. అయితే ఇక్కడి జ్యురి ఎంపిక చేసిన లిస్ట్ లో గీత గోవిందం చిలసౌలు కూడా ఉండటం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. దానికి కారణాలు లేకపోలేదు.

గీత గోవిందం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినప్పటికీ అదొక ప్రేమ కథ. మరీ గొప్పగా చెప్పుకునే ప్రత్యేకత ఏమి లేదు. ఒక చిన్న అపార్థంతో మొదలైన ఓ జంట ప్రయాణం చివరికి ప్రేమ తీరం ఎలా చేరుకుంది అనే పాయింట్ ని దర్శకుడు పరశురామ్ ఎంటర్ టైనింగ్ గా చెప్పడంతో యూత్ బ్రహ్మరధం పట్టారు. ఇక ఒక రాత్రి నేపధ్యాన్ని తీసుకుని దానికి పెళ్లి చూపులకు ముడి పెట్టి రాహుల్ రవీంద్రన్ డీల్ చేసిన చిలసౌ ప్రశంశలు అందుకుంది

ఇప్పుడు ఎవరికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే కోణంలో చూస్తే విశ్లేషకులు మహానటి రంగస్థలం వైపే చూపుతున్నారు. శతమానం భవతి తర్వాత మరోసారి జాతీయ అవార్డు దక్కించుకునే సత్తా ఈ రెండింటికె ఉందని అంచనా. నటన పరంగా చూసుకున్నా ఈ రెండు సినిమాల్లో కీర్తి సురేష్ రామ్ చరణ్ లు కెరీర్ బెస్ట్ పెరఫార్మన్స్ ఇచ్చారు. అయితే పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇదంత ఈజీ కాదు. మే మొదటివారంలో జాతీయ అవార్డుల ప్రధానం జరిగే అవకాశం ఉంది. ఫైనల్ గా ఈ పురస్కారం ఏ సినిమాకు దక్కుతుందోనన్న ఆసక్తి సినిమా ప్రేమికుల్లో మొదలైంది