Begin typing your search above and press return to search.

ఒకేరోజు మూడు పాన్ ఇండియా సినిమాల పోటీ

By:  Tupaki Desk   |   22 Jan 2023 4:30 PM GMT
ఒకేరోజు మూడు పాన్ ఇండియా సినిమాల పోటీ
X
పాన్ ఇండియా సినిమా ట్రెండ్ ప్రస్తుతం బలంగా నడుస్తుంది. అన్ని భాషలలో స్టార్ హీరోలు చిత్రాలను మల్టీ లాంగ్వేజ్ లో ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలా చేయడం ద్వారా ఇండియన్ వైడ్ గా ఉన్న సినిమా మార్కెట్ తో భారీ కలెక్షన్స్ సొంతం చేసుకోవచ్చని ఆలోచనతో దర్శక, నిర్మాతలు ఉన్నారు. ఇప్పటికే స్ట్రాటజీ బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ సిరీస్, కంతారా, పుష్ప, సాహో, రాదేశ్యామ్, బ్రహ్మాస్త్ర సినిమాల విషయంలో వర్కౌట్ అయింది. పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు రిలీజ్ చేయడం వల్ల ఒక భాషలో ప్రేక్షకులు రాకున్న మరొక భాషలో నచ్చితే కచ్చితంగా సినిమాకి భారీ కలెక్షన్స్ వస్తాయి.

ఈ మధ్యకాలంలో సినిమా నిర్మాణం వ్యయం 100 కోట్లు దాటిపోయింది. టైర్ 2 హీరోల సినిమాలకి కూడా 50 నుంచి 80 కోట్ల వరకు బడ్జెట్ అవుతుంది. ఈ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టాలంటే మాత్రం కచ్చితంగా ఒక్క భాషకికి సినిమా పరిమితమైతే సరిపోతుంది. ఈ విషయం గ్రహించిన దర్శకులు కూడా ఒక భాషలో సినిమాని తెర్కెక్కించి వివిధ భాషలలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. వాటికి పాన్ ఇండియా బ్రాండ్ ఇస్తున్నారు. సినిమాలో పాన్ ఇండియా లుక్ కోసం నటీనటులని కూడా అందుకు తగ్గట్లుగానే ఎంపిక చేసుకుంటున్నారు. వివిధ భాషల నుంచి ఆర్టిస్ట్స్ ఉండేలా చూసుకుంటున్నారు.

మెయిన్ హీరో ఒరిజినల్ లాంగ్వేజ్ కి సంబంధించిన వ్యక్తి ఉంటే, విలన్స్, ఇతర ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్స్ కోసం ఇతర భాషలకి సంబందించిన నటులు ఉండే విధంగా దర్శకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారసుడు సినిమా విషయం ఇప్పటికే వంశీ పైడిపల్లి అదే ఫార్ములాని ఉపయోగించాడు. కోలీవుడ్లో జైలర్ సినిమా కోసం కూడా నెల్సన్ దిలీప్ అదే ఫార్ములా వాడుతున్నాడు. బాలీవుడ్ దర్శకుడు కూడా సౌత్ ఇండస్ట్రీకి చెందిన నాటులను తమ సినిమాలలో కీలకపాత్రల కోసం ఎంపిక చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆగస్టు 11న 3 పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

కోలీవుడ్ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న మూవీ కూడా అదే రోజు రిలీజ్ కాబోతుంది. బాలీవుడ్ లో సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ కాంబినేషన్ వస్తున్న యానిమల్ సినిమా కూడా ఆగస్టు 11 రిలీజ్ కి సిద్ధం అవుతుంది. ఈ మూడు సినిమాల మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మూడు భాషల్లో భారీ అంచనాల నడుమ ఇవి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి వీటిలో ఏ సినిమాకి ప్రేక్షకులు ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కంటెంట్ బలం ఉంటే బాషకు సంబంధం లేకుండా సినిమా సక్సెస్ అవుతుందని కాంతారా మూవీ ప్రూవ్ చేసింది. ఆడియన్స్ టేస్ట్ మారడంతో ఈసారి సినిమాల సక్సెస్ ఎవరికి వస్తుంది అనేది అర్థం కాని ప్రశ్నగా ఉంది.