Begin typing your search above and press return to search.
తగ్గేదే లే..కుర్రా హీరోలతో పోటీపడుతున్నారే?
By: Tupaki Desk | 23 April 2022 3:30 AM GMTమునుపెన్నడూ లేనంతగా మన సీనియర్ స్టార్స్ ఈ మధ్య స్పీడు పెంచేశారు. ఒక సినిమా లైన్ లో వుండగానే మరో మూడు లేదా నాలుగు చిత్రాలని లైన్ లో పెట్టేస్తూ షాకిస్తున్నారు. యంగ్ హీరోలే ఒకటి రెండు సినిమాలతో సరిపెట్టుకుంటుంటే మన సీనియర్ స్టార్ లు మాత్రం తగ్గేదేలే అంటే గట్టి పోటికి రెడీ అవుతున్నారు. వరుస చిత్రాల్లో నటిస్తూ వామ్మో వీళ్లు సీనియర్ ల లేక కుర్ర హీరోలా అని అభిమానులు అవాక్కయ్యేలా చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నుంచి మాస్ మహారాజా రవితేజ వరకు ఇదే ఫార్ములాని ఫాలో అవుతూ షాకుల మీద షాకులిస్తున్నారు. పదేళ్ల విరామం తరువాత `ఖైదీ నంబర్ 150`లో సెకండ్ ఇన్నింగ్స్ కి తెరలేపిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యంగ్ హీరోలనే విస్మయానికి గురిచేస్తూ దాదాపు ఐదు చిత్రాల్లో నటిస్తున్నారాయన. ప్రస్తుతం ఆయన నటించిన `ఆచార్య` ఏప్రిల్ 29న విడుదల కాబోతోంది. దీనితో పాటు మరో నాలుగు చిత్రాలు ఆయన చేతిలో వున్నాయి.
తమిళ సూపర్ హిట్ ఫిల్మ్ `వేదాలం` ఆధారంగా రూపొందుతున్న `భోళా శంకర్` చిత్రీకరణ దశల వుంది. ఇక మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన `లూసీఫర్` ని తెలుగులో `గాడ్ ఫాదర్`గా రీమేక్ చేస్తున్నారు. బాబీ డైరెక్ట్ చేస్తున్న `వాల్తేరు వీరయ్య` కూడా చిత్రీకరణ దశలోనే వుంది. ఇక వెంకీ కుడుముల తో దానయ్య నిర్మించనున్న మూవీ మాత్రం త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఇలా వరుసగా నాలగు చిత్రాల్లో నటిస్తూ కుర్ర హీరోలకు ధీటుగా ప్రాజెక్ట్ లు చేస్తున్నారు. త్వరలోనే సుకుమార్ తోనూ ఓ భారీ ప్రాజెక్ట్ ని ప్రకటించబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
ఇక చిరు తరువాత బిజీగా మారుతున్న హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ . ప్రస్తుతం హరి హర వీరమల్లు` చిత్రంలో నటిస్తున్న పవన్ ఈ మూవీతో పాటు హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న `భవదీయుడు భగత్ సింగ్` ని కూడా పట్టాలెక్కించబోతున్నారు. వీటిని రాకెట్ స్పడుతో పూర్తి చేసి మరో రెండు రీమేక్ లని లైన్ లో పెడుతున్నారు. అందులో ఒకటి సముద్రఖని నటించి తెరకెక్కించిన `వినోదాయ సితం`. మరొకటి విజయ్ హీరోగా నటించిన `థేరీ`.
`వినోదాయ సితం`కు సముద్రఖని దర్శకత్వం వహించనుండగా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. ఇక `థేరీ` రీమేక్ ని `సాహో` ఫేమ్ సుజీత్ డైరెక్ట్ చేయబోతున్నారు. వీటితో పాటు త్రివిక్రమ్, సురేందర్ రెడ్డిలతో ప్రాజెక్ట్ లు చేయబోతున్నారు. ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేసే పవన్ ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలని లైన్ లో పెట్టడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక ఇదే తరహాలో నందమూరి బాలకృష్ణ కూడా స్పీడు పెంచేస్తున్నారు. ఇటీవల `అఖండ`తో బ్లాక్ బస్టర్ ని అందుకున్న బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో ఓ మూవీ చేస్తున్నారు. దీనితో పాటు అనిల్ రావిపూడి డైరెక్షన్ లోనూ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీనికి సంబంధించిన ప్రకటన రావాల్సి వుంది.
ఇక ఈ సీరియర్ బ్యాచ్ తో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా స్పీడు పెంచేశాడు. ఇప్పడు అతని చేతిలో నాలుగు సాలీడ్ ప్రాజెక్ట్ లున్నాయి. `రామారావు ఆన్ డ్యూటీ` ఇప్పటికే పూర్తయి జూన్ 17 కు రాబోతోంది. ఇక సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న `రావణాసుర`, త్రినాధరావు నక్కినతో చేస్తున్న `ధమాకా` చిత్రీకరణ దశలో వున్నాయి. రీసెంట్ గా టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ `టైగర్ నాగేశ్వరరావు` ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.