Begin typing your search above and press return to search.
అట్లీ 'జవాన్' కాపీ క్యాట్ అంటూ నిర్మాత ఫిర్యాదు
By: Tupaki Desk | 6 Nov 2022 7:30 AM GMTవరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్ ల తర్వాత అట్లీ షోబిజ్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అయ్యాడు. దళపతి విజయ్ సినిమాలకు బ్యాక్ టు బ్యాక్ దర్శకత్వం వహించిన తర్వాత అట్లీకి బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ను దర్శకత్వం వహించే గోల్డెన్ ఛాన్స్ దక్కింది. అట్లీ బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న వేళ కోలీవుడ్ మొత్తం గర్వపడుతుండగా అతడిపై తాజా ఆరోపణలు సంచలనంగా మారాయి. ఓ పాత సినిమా కథను కాపీ కొట్టి షారూఖ్ తో `జవాన్`గా రీమేక్ చేస్తున్నాడనే ఆరోపణలతో ఇప్పుడు కొత్త వివాదంలో చిక్కుకున్నాడు.
కింగ్ ఖాన్ అట్లీపై ఎంతో హోప్స్ తో ఉన్నాడు. జవాన్ చిత్రంతో తన పాన్-ఇండియన్ రేసింగ్ కోసం సిద్ధమవుతున్నాడు. అయితే ఈ చిత్రంపై తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేయడంతో కాపీ క్యాట్ ఆరోపణలను ఎదుర్కొంటోంది. వాస్తవానికి అసలేం జరిగింది? అన్నది ఆరా తీస్తే తమిళ మీడియాలో కథనాలు ఇలా ఉన్నాయి.
అట్లీ కెరీర్ ఆరంభం ఒరిజినల్ కథలతో చాలా వేగంగా వరుస విజయాలు అందుకున్నాడు. దళపతి విజయ్ తో అతని అనుబంధం చాలా అదృష్టంతో కూడుకున్నది. బ్యాక్ టు బ్యాక్ మూడు బ్లాక్ బస్టర్స్ విజయ్ తో సాధించి టాప్ లీగ్ డైరెక్టర్ గా మారాడు. ఇకపోతే కింగ్ ఖాన్ జవాన్ లో కూడా విజయ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పుడు అట్లీ పాన్-ఇండియన్ చిత్రం `జవాన్`తో బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. కానీ ఆరంభంలోనే అతడు కొన్ని చిక్కులను ఎదుర్కొంటున్నాడు. జవాన్ చిత్రం ఒక అవాంతరాన్ని ఎదుర్కొంటోంది.
తాజా కథనాల ప్రకారం.. అట్లీ జవాన్ పై ప్రముఖ తమిళ నిర్మాత మాణికం నారాయణన్ తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి (TFPC)లో ఫిర్యాదు చేసారు. విజయకాంత్ నటించిన 2006 తమిళ చిత్రం `పేరరసు`ని కాపీ చేసాడని దర్శకుడు అట్లీపై ఫిర్యాదు చేసాడు. రెండు కథలు ఒకేలా ఉన్నాయని అతడు ఆరోపిస్తున్నా కానీ ఫిర్యాదునకు కారణం అస్పష్టంగా ఉంది. అట్లీ తన చిత్రాలతో ప్లాగరిజం సమస్యలను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదని కూడా సదరు నిర్మాత విమర్శించారు.
మరోవైపు జవాన్ కి సంబంధించిన అప్ డేట్ లు ఎప్పుడు వస్తాయో అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో దర్శకుడు అట్లీపై కాపీ క్యాట్ ఫిర్యాదు నమోదవ్వడం అభిమానులను కలవరపెడుతోంది. పేరరసు కథను అట్లీ కాపీ కొట్టారని సెవెన్త్ ఛానల్ ప్రొడక్షన్ హౌస్ యజమాని .. ప్రముఖ నిర్మాత మాణిక్యం నారాయణన్ ఆరోపించాక ఫ్యాన్స్ లో నిజం ఏంటో తెలుసుకోవాలన్న ఉత్కంఠ నెలకొంది. దీనికి అట్లీ నుంచి సమాధానాన్ని ఆశిస్తున్నారు.
ఈ సినిమా పాపులర్ హాలీవుడ్ బ్లాక్ బస్టర్ `డార్క్ మ్యాన్` నుండి స్ఫూర్తి పొంది రూపొందిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. నిజానికి డార్క్ మేన్ నుండి ప్రేరేపితమై తీసినది- పేరరసు అని కొందరు విశ్లేషిస్తుండగా.. మరికొందరు మునుపటి సినిమాకి తరువాతి సినిమా పూర్తి కాపీ అని కూడా అన్నారు. మరోవైపు పేరరసును కాపీ చేసి అట్లీ దోషిగా తేలితే అతనిపై తగిన చర్యలు తీసుకుంటామని ఆ చిత్ర నిర్మాత తెలిపారు. నిర్మాతల మండలితో పాటు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ కి కూడా నిర్మాత మాణిక్యం లేఖ రాశారు.
ఈ చిత్రంలో విజయకాంత్ కవల సోదరులుగా కనిపిస్తారు. పేరరసు -ఇళవరసుగా ద్విపాత్రాభినయంతో అతడు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో రెండో పాత్ర బాధ్యతాయుతమైన సీబీఐ అధికారి అయితే.. తన తండ్రి మరణానికి కారకుడైన మాజీ మంత్రిపై ప్రతీకారం గా అతడిని చంపాలని వేట సాగించేవాడిగా మొదటి పాత్ర తీరు ఉంటుంది.
జవాన్ లో నయనతార కథానాయికగా నటిస్తుంది. నయన్ తో పాటు అట్లీకి ఇది బాలీవుడ్ అరంగేట్ర చిత్రం. ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మిస్తోంది. హిందీ- తమిళం- తెలుగు- మలయాళం - కన్నడ భాషల్లో 2 జూన్ 2023న `జవాన్` విడుదల కానుంది.