Begin typing your search above and press return to search.
కిచ్చ సుదీప్ పై చీటింగ్ ఆరోపణలు!
By: Tupaki Desk | 1 Aug 2018 4:46 PM GMT`ఈగ` సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన కిచ్చ సుదీప్ ....ఆ తర్వాత బాహుబలి వంటి సినిమాలలో విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న `సైరా`లో కూడా`కిచ్చ`సుదీప్ కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. అయితే, తాజాగా సుదీప్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. సుదీప్ తనను మోసం చేశాడని కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన కాఫీ ఎస్టేట్ యజమాని దీపక్ మయూర్ కర్ణాటక ఫిల్మ్ చాంబర్ లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. తనకు న్యాయం చెయ్యాలని కోరుతూ ఫిల్మ్ చాంబర్ ను ఆశ్రయించాడు. గతంలో సుదీప్ నిర్మించిన ఓ సీరియల్ షూటింగ్ సందర్భంగా....తన కాఫీ తోట - అక్కడి విలువైన వస్తువులు ధ్వంసమై నష్టం జరిగిందని.....అయినప్పటికీ...అగ్రిమెంట్ ప్రకారం సుదీప్ నష్టపరిహారం చెల్లించలేదని ఫిర్యాదు చేశారు.
సుదీప్ సొంత నిర్మాణ సంస్థ అయిన కిచ్చ క్రియేషన్ నిర్మాణ సారథ్యంలో వారస్థార (వారసుడు) అనే కన్నడ సీరియల్ ప్రసారమవుతోంది. ఆ సీరియల్ షూటింగ్ ను దీపక్ మయూర్ కు చెందిన కాఫీ ఎస్టేట్ లో నిర్వహించారు. అయితే, షూటింగ్ సమయంలో కాఫీ తోట - అక్కడి చెట్లతో పాటు విలువైన వస్తువులు దెబ్బతిని తనకు నష్టం జరిగిందని దీపక్ తెలిపారు. అయితే, ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం తనకు సుదీప్ నష్టపరిహారం చెల్లించలేదని ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని సీఎం దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ....న్యాయం జరగలేదని దీపక్ ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై సుదీప్ ఇంతవరకు స్పందించలేదని దీపక్ వాపోయారు. అందుకే, సుదీప్ మీద చర్యలు తీసుకొని తనకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ను ఆశ్రయించానని చెప్పారు. అయితే, ఈ ఫిర్యాదుపై సుదీప్, కర్ణాటక ఫిల్మ్ చాంబర్ పెద్దలు ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.