Begin typing your search above and press return to search.
భీమ్లానాయక్ పై పోలీసులకు ఫిర్యాదు
By: Tupaki Desk | 1 March 2022 5:29 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లానాయక్’. పవన్ కళ్యాణ్ స్టామినాను ఈ సినిమా మరోసారి నిరూపించింది. భారీగా కలెక్షన్లను కొల్లగొడుతోంది. మలయాళ సినిమా ‘అయ్యప్పమ్ కోషియమ్’ రిమేక్ గా వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలైంది. రానా, నిత్యమీనన్, సంయుక్త మీనన్ ప్రధాన తారాగణం.
ఈ సినిమా పవన్ ఫ్యాన్స్ కు పండుగ తీసుకువచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల రికార్డ్ క్రియేట్ చేసింది. భీమ్లానాయక్ మూవీపై ఏపీలో పొలిటికల్ హీట్ కూడా నడుస్తోంది. ఇటీవల కాలంలో ప్రతీ సినిమాలో ఏదో ఒక సన్నివేశం తమ మనోభావాలను కించపరిచేలా ఉందని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటనలున్నాయి.తాజాగా భీమ్లానాయక్ కు కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది.
ఇదిలా ఉంటే భీమ్లానాయక్ సినిమాకు షాక్ తగిలింది. ఈ సినిమాపై పోలీసులకు ఫిర్యాదు అందింది. తమ నోభావాలను దెబ్బతీస్తుందని కుమ్మరి కులస్థులు ఆరోపిస్తున్నారు. ఏపీ కుమ్మరి, శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ ఎం పురుషోత్తం గుంటూర్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
తాము ఎంతో పవిత్రంగా భావించే ‘కుమ్మరి చక్రాన్ని’ రానా కాలుతో తన్నే సన్నివేశం తమ మనోభవాలను కించపరిచేలా ఉన్నాయని ఆరోపించారు. వెంటనే ఆ సన్నివేశాలను సినిమా నుంచి తొలగించేలా పురుషోత్తం డిమాండ్ చేశారు.