Begin typing your search above and press return to search.
కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాని ఆపేయండి..వర్మ కి షాక్
By: Tupaki Desk | 28 Oct 2019 12:33 PM GMTరామ్ గోపాల్ వర్మ నిత్యం వివాదాలతో స్నేహం చేసే వ్యక్తి. వర్మ ఏదైనా ఒక సినిమా చేయాలి అంటే అది ఎదో ఒక వివాదంతోనే మొదలుకావాలి. ఈ వివాదమే వర్మ సినిమాలకి కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చిపెడుతుంది. అందుకే వర్మ సినిమాలకి పెద్దగా పబ్లిసిటీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ మద్యే వర్మ డైరెక్షన్ లో వచ్చిన లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకి ముందు ఇన్ని వివాదాలకు కేంద్ర బిందువుగా మారిందో అందరికి తెలిసిందే. కానీ , సినిమాపై ఇన్ని వివాదాలు ఉన్నప్పటికీ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
ఇక వర్మ తాజా చిత్రం కమ్మరాజ్యంలో కడప రెడ్లు. దీనికి సంబంధించి తాజాగా దీపావళి కానుకగా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. ఈ సమయంలో ఈ సినిమా పై ఒక వివాదం మొదలైంది. సినిమా టైటిల్ - కథపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. అనంతపురం టూటౌన్ పోలీసులకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి - రిజర్వేషన్ల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నాగరాజు ఫిర్యాదు చేశారు.
‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా టైటిల్ను నిషేధించాలని - సినిమా విడుదలను అడ్డుకోవాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కులాల మధ్య గొడవలు సృష్టిస్తూ.. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా సినిమా టైటిల్ పెట్టారని - అతనిపై కులాలను రెచ్చగొట్టేలా వ్యవహరించినందుకు గాను చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధానమంత్రి - ముఖ్యమంత్రి - ప్రజాప్రతినిధులను ప్రజాస్వామ్యయుతంగా - రాజ్యాంగబద్ధంగా ఎన్నుకుంటారని - కులాల పేరిట కాదని లేఖలో వెల్లడించారు. ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరింది.ఈ వివాదం పై వర్మ ఏ విధంగా స్పందిస్తారో మరి...