Begin typing your search above and press return to search.
కేవలం 6 నెలల్లో రాసిన స్క్రిప్ట్?
By: Tupaki Desk | 16 Aug 2022 3:30 PM GMTటాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ అందుకుని ఇటీవల రెండున్నరేళ్ల పాటు వేచి చూసిన ప్రముఖ దర్శకరచయితపై రకరకాలుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అతడు ఒక పెద్ద హీరోకి స్క్రిప్టు వినిపించి ఒప్పించలేకపోయాడు.
ఆ డీల్ మిస్సయ్యాక.. మరో అగ్ర హీరోకి లైన్ వినిపించి ఓకే చేయించుకున్నాడు. కానీ ఏడాది పైగానే అతడు ఈ మూవీ కోసం వేచి చూశాడు. ఎట్టకేలకు ఇప్పుడు ఆ సినిమాని ప్రారంభించేందుక రెడీ అవుతున్నాడు.
ఇంతకీ ఆ స్క్రిప్ట్ ఎలా ఉండబోతోంది? ఇంతకాలం పాటు దానిపైనే వర్క్ చేశారు కదా? అని ఇండస్ట్రీ వర్గాలు ఆరాలు తీయడం ప్రారంభించాయి. ఈ రెండున్నరేళ్లు తీరిక సమయాల్లో కేవలం అతడు ఆ స్క్రిప్టు కోసమే కేటాయించాడా? అంటే అలాంటిదేమీ లేదని కేవలం ఆరు నెలల్లో స్క్రిప్టు పనిని చుట్టేసి తన ఇతర కమిట్ మెంట్లతో బిజీగా ఉన్నారని కూడా గుసగుస వినిపిస్తోంది.
నిజానికి ఏ హీరోకి అయినా తొలుత లైన్ వినిపించి ఓకే చేయించుకుంటాడు. ఆ తర్వాత స్క్రిప్టు ని ఓకే చేయించుకుంటాడు. అటుపై డైలాగ్ వెర్షన్ రాస్తారు. కానీ ఈసారి ఈ ప్రక్రియ చాలా వేగంగా పూర్తయింది. స్క్రిప్టుని కేవలం ఆరు నెలల్లోనే చుట్టేసారని కూడా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ స్క్రిప్టు ఫైనల్ వెర్షన్ ని సదరు స్టార్ హీరో ఓకే చేయడం విశేషం.
అయితే స్క్రిప్టు ఎన్ని రోజుల్లో రాసారు? అనే దానికంటే ఎంత గ్రిప్పింగ్ గా వినిపించారు అన్నది ఇక్కడ చాలా కీలకం. ప్రస్తుతం షూటింగ్ ని ప్రారంభించేందుకు ప్రీప్రొడక్షన్ ని కూడా పూర్తి చేసేసారు.
ఈ మూవీ కథాంశం ఎలా ఉండనుంది? అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో వరుసగా ఇదే స్టార్ హీరోతో రెండు ఫ్లాపులు తీసిన ఫేమస్ డైరెక్టర్ ఈసారి పెద్ద హిట్టిస్తాడా లేదా? అన్నది వేచి చూడాలి.