Begin typing your search above and press return to search.
ఆ కాంప్లిమెంట్ కు మురిసిపోతున్న వర్మ
By: Tupaki Desk | 29 March 2019 2:22 PM GMTఎన్నో వివాదాల నడుమ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం నేడు విడుదల అయ్యింది. ఏపీలో విడుదలకు హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ మరియు ఇతర ప్రాంతాల్లో మూవీ విడుదల అయ్యింది. ఈ చిత్రంకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. బాలకృష్ణ చేసిన 'ఎన్టీఆర్' చిత్రం కంటే వర్మ తీసిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం బాగుందని పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. వర్మ వాటిని తన వాల్ పై పోస్ట్ చేస్తున్నాడు.
సినిమా విడుదల సందర్బంగా వర్మ మీడియా ముందుకు వచ్చాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... నా సినిమా ఎన్నికలను ప్రభావితం చేయాలని భావించలేదు - నేను తీసిన సినిమాలో కొన్ని పాత్రలు ఇప్పుడు ఉన్న కారణంగా హైప్ తీసుకు వచ్చేందుకు పబ్లిసిటీ చేశాను తప్ప నేను సినిమాను రాజకీయం చేయాలని భావించలేదు. నా సినిమాలో ఎన్టీఆర్ గారి నిజ జీవితాన్ని చూపించాను. ఎన్టీఆర్ గారు 70 ఏళ్లు మహారాజుగా బతికారు, కాని చనిపోవడానికి నాలుగు నెలల ముందు ఆయన చాలా దారుణమైన పరిస్థితిని అనుభవించారు. ఆ విషయం నన్ను కదిలించింది. అందుకే నేను ఆ విషయాన్ని నా కథా వస్తువుగా తీసుకున్నాను.
ఎన్టీఆర్ గారి జీవితంలో ఏదైతే జరిగిందో వాటిని నేను నమ్మి ఆ సంఘటనలు సినిమాలో పెట్టాను. చనిపోవడానికి నాలుగు రోజుల ముందు కూడా ఎన్టీఆర్ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో చెప్పిన పాయింట్లు కూడా నేను సినిమాలో వాడాను. సినిమా విడుదల తర్వాత మంచి రెస్పాన్స్ వస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ గారికి నిజమైన వారసుడు రామ్ గోపాల్ వర్మ అంటూ ఒక వ్యక్తి నాకు మెసేజ్ చేశాడు. నా సినీ కెరీర్ లోనే అది బెస్ట్ కాంప్లిమెంట్ గా భావిస్తాను అంటూ వర్మ చెప్పుకొచ్చాడు. ఏపీలో విడుదల కాకున్నా కూడా ఇతర ప్రాంతాల్లో చిత్రంను విడుదల చేయడం సంతోషంగా ఉందని, అది కూడా తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున సినిమాను విడుదల చేయడం మరింత సంతోషంగా ఉందని వర్మ చెప్పుకొచ్చాడు.