Begin typing your search above and press return to search.

అలియా క్యూట్ బేబీని చూడటానికి బంధుమిత్రులకు షరతులు..!

By:  Tupaki Desk   |   12 Nov 2022 3:53 AM GMT
అలియా క్యూట్ బేబీని చూడటానికి బంధుమిత్రులకు షరతులు..!
X
బాలీవుడ్ స్టార్ కపుల్ అలియా భట్ - రణ్ బీర్ కపూర్ దంపతులు ఈ మధ్యనే తల్లిదండ్రులయిన సంగతి తెలిసిందే. ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో నవంబర్ 6న ఆలియా పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.

నాలుగు రోజుల అనంతరం నవంబర్ 10న అలియా భట్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. రణబీర్ దంపతులు తమ పాపతో కలిసి హాస్పిటల్ నుంచి కారులో బయటకు వస్తున్న ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి.

రణబీర్ - అలియా తమకు అమ్మాయి పుట్టిన విషయాన్ని వెల్లడించారు కానీ.. బేబీ ని ఇంతవరకు బయటకు చూపించలేదు. ఆసుపత్రి నుంచి కారులో ఇంటికి వెళ్తున్న సమయంలో కూడా రణ్ బీర్ తన చేతిలో ఉన్న పాప ముఖం కనిపించకుండా జాగ్రత్తపడ్డాడు.

ఇంటికి వచ్చాక కూడా అలియా భట్ తన బుజ్జాయి పట్ల మరింత జాగ్రత్తలు వహిస్తున్నారట. పాపని చూడటానికి వచ్చే బంధువుల విషయంలో కాస్త కఠినంగా వహిస్తోందట. అయితే అది కేవలం తన బిడ్డ క్షేమం కోసమేనని అంటున్నారు.

అలియా - రణబీర్ ఇంటికి వచ్చిన తర్వాత బంధుమిత్రులు మరియు సన్నిహితులు బేబీని చూడటానికి వస్తున్నారట. కానీ ఈ క్యూట్ బేబీని చూడటానికి సెలబ్రిటీ కపుల్ ఓ షరతు విధించారట.

తమ పాపను చూడాలంటే తప్పనిసరిగా కోవిడ్ టెస్ట్ చేయించుకొని.. నెగెటివ్ గా నిర్థారించబడిన సర్టిఫికేట్ తప్పనిసరి అంటూ కండిషన్ పెట్టారట. అయితే బేబీ కి బయటి వ్యక్తుల నుంచి ఎలాంటి సమస్య రాకూడదనే అలియా దంపతులు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

పాప రాకతో కపూర్ ఫ్యామిలీలో సందడి వాతావరణం నెలకొంది. లక్ష్మీదేవి వచ్చిందని ప్రతి ఒక్కరూ సంతోషంలో మునిగి తేలుతున్నారని తెలుస్తోంది. చిన్నారి పాపను త్వరలోనే అందరికీ చూపిస్తారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

గత కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్న అలియా భట్ - రణబీర్ కపూర్.. ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీన వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది.

అయితే ఈ జంట పెళ్లయిన రెండు నెలలకే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసి వార్తల్లో నిలిచారు. గర్భిణీగా ఉన్నప్పటికీ భార్యాభర్తలిద్దరూ కలిసి నటించిన "బ్రహ్మాస్త్రం" మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంది అలియా. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.