Begin typing your search above and press return to search.
'బిగ్ బాస్ 5' పై లేటెస్ట్ అప్డేట్..!
By: Tupaki Desk | 15 July 2021 3:51 PM GMTవరల్డ్ టెలివిజన్ పైనే బిగ్గెస్ట్ రియాలిటీ షో అనిపించుకున్న 'బిగ్ బాస్'.. భారతీయ బుల్లితెర ప్రేక్షకులకు అసలైన మజాని పరిచయం చేసింది. హిందీలో ఇప్పటికే 14 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న 'బిగ్ బాస్'.. పలు ప్రధాన భాషల్లో అశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. తెలుగు బుల్లితెరపైకి ఆలస్యంగా వచ్చిన ఈ రియాలిటీ షో.. సక్సెస్ ఫుల్ గా నాలుగు సీజన్స్ ని కంప్లీట్ చేసుకుంది. 'స్టార్ మా' నిర్వహించిన 'బిగ్ బాస్' ఇండియన్ టెలివిజన్ స్క్రీన్ పై అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ తెచ్చుకున్న షో గా నిలిచి రికార్డులు క్రియేట్ చేసింది.
మొదటి మూడు సీజన్లు అనుకున్న ప్రకారమే నిర్వహించగా.. 'బిగ్ బాస్ 4' మాత్రం కరోనా నేపథ్యంలో కాస్త లేట్ గా ప్రారంభమైంది. గతేడాది కోవిడ్ వైరస్ విజృంభిస్తున్న సమయంలో ప్రసారమైన ఈ షో.. మూడున్నర నెలల పాటు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. అందుకే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు అందరూ 'బిగ్ బాస్ 5' కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి ఐదో సీజన్ ను ముందుగానే ప్రారంభించాలని నిర్వహకులు ప్లాన్ చేసుకున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఆలస్యం అయింది. అయినప్పటికీ ఈ షో గురించి మీడియాలో సోషల్ మీడియాలో నిత్యం చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అనేక ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
తెలుగు 'బిగ్ బాస్ 5' గురించి నిర్వాహకులు అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ చివరి దశకు వచ్చిందని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ రియాలిటీ షో గురించి మరొక వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే త్వరలోనే 'బిగ్ బాస్' 5వ సీజన్ అనౌన్స్ మెంట్ కు సంబంధించిన ప్రోమో రిలీజ్ కానుందట. ఆగస్టు ఫస్ట్ వీక్ లో టీజర్ కట్ బయటకొచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అలానే గతేడాది మాదిరిగానే సెప్టెంబర్ రెండో వారంలో 'బిగ్ బాస్ 5' ప్రసారం అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
ఇకపోతే 'బిగ్ బాస్ 5' కు హోస్ట్ గా ఎవరు చేస్తారనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. గత రెండు సీజన్లను సక్సెస్ ఫుల్ గా నడిపించిన కింగ్ అక్కినేని నాగార్జున ఐదో సీజన్ కు హోస్టింగ్ చేస్తారని అందుకున్నారు. కానీ ఈ సీజన్ కు నాగ్ అందుబాటులో ఉండరని వార్తలు వస్తున్నాయి. దీంతో ఎవరు హోస్ట్ గా ఉంటే బాగుంటుంది అనే దానిపై పెద్ద ఎత్తున డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ సీజన్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఎన్టీఆర్.. ఇప్పుడు 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో చేస్తున్నారు. 'బిగ్ బాస్ 2' చేసిన నాని ఇప్పుడు వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రానా దగ్గుబాటి హోస్ట్ గా ఉంటారని టాక్ ఉంది. మరి 'స్టార్ మా' వారు త్వరలోనే దీనిపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.