Begin typing your search above and press return to search.
ఎంఎస్‌రాజు.. ప్రభుదేవా మధ్య గొడవ? పదిహేనేళ్లకు తెలిసిన నిజం..!
By: Tupaki Desk | 24 May 2021 1:30 PM GMT2006లో విడుదలైన పౌర్ణమి సినిమా అట్టర్‌ప్లాప్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో ప్రొడ్యూసర్ ఎంఎస్‌రాజు .. దర్శకుడు ప్రభుదేవా మధ్య పెద్ద గొడవ జరిగినట్టు అప్పట్లో పెద్ద రూమర్స్ వచ్చాయి. ఈ విషయాన్ని వీళ్లిద్దరూ ఖండంచలేదు.. దీంతో ఆ రూమర్స్ అలాగే ఉండిపోయాయి. తాజాగా ఈ రూమర్స్ పై ఎంఎస్‌రాజు క్లారిటీ ఇచ్చాడు. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ అధినేత ఎంఎస్‌రాజు అంటే అప్పట్లో ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉండేది. ఆ సంస్థ ఎన్నో అద్భుత చిత్రాలను తెరకెక్కించింది.
ముఖ్యంగా ప్రేమకథలను ఈ ప్రొడక్షన్స్ వారు చాలా బాగా చిత్రీకరించేవారు. వర్షం, మనసంతానువ్వే, నువ్వొస్తానంటే నెనొద్దంటానా వంటి బ్లాక్ బ్లస్టర్ చిత్రాలు ఎంఎస్‌రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కాయి. స్వయంగా ఎంఎస్‌రాజు రచయిత, ఆయన సినిమాలకు స్క్రీన్‌ప్లే కూడా అందించేవారు. దీంతో ఎంఎస్‌రాజు ఎంతో టేస్ట్ ఉన్న నిర్మాత అని అప్పట్లో టాక్ ఉండేది. అయితే ఆయన దర్శకత్వ విభాగంలో జోక్యం చేసుకుంటాడని కూడా విమర్శలు ఉండేవి.
ఇదిలా ఉంటే సుమంత్ ఆర్ట్స్ బ్యానర్‌కు సక్సెస్ రేటు ఎక్కుగా ఉండేది కాబట్టి.. ఆ విమర్శలను అప్పట్లో ఎవరూ పట్టించుకొనేవారు కాదు. చాలా మంది యువహీరోలు .. సుమంత్ ఆర్ట్స్పతాకంలో నటించాలని భావించేవారు. ప్రభాస్‌కు తన కెరీర్ లో బ్లాక్‌బ్లస్టర్‌గా నిలిచిన వర్షం సినిమా సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ వాళ్లే నిర్మించారు. దీంతో ఎంఎస్రాజుతో మరో సినిమాలో నటించాలని ప్రభాస్ ఫిక్స్ అయ్యాడు. ఇందుకోసం కథ కూడా సిద్ధమైంది.ఇక సుమంత్ ఆర్ట్స్ బ్యానర్లో అంతకు ముందు వచ్చిన నువ్వొస్తానంటే నెనొద్దాంటానా చిత్రం బ్లాక్‌బస్టర్ దీంతో ఆ చిత్ర దర్శకుడు ప్రభుదేవాతో మరో సినిమా తీయాలని ఎంఎస్‌రాజు భావించారు. వెరసి పౌర్ణమి చిత్రం పట్టాలకెక్కింది.
ఆడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ చిత్రంలోని కొన్ని పాటలు ఆల్‌టైం హిట్‌గా నిలిచాయి. కానీ వివిధ కారణాల వల్ల చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అంతకుముందే ప్రభాస్ చత్రపతి రూపంలో భారీ హిట్ అందుకున్నాడు. మరోవైపు పౌర్ణమి కొంత హీరోయిన్ ఓరియెంటెంట్ మూవీగా ఉంటుంది. ఇలా రకరకాల కారణాలతో ఈ సినిమా ఫెయిల్ అయ్యింది. అయితే ఈ సందర్భంగా ఎంఎస్ రాజు.. దర్శకుడు ప్రభుదేవా మధ్య గొడవలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ వివాదంపై ఎంఎస్ రాజు క్లారిటీ ఇచ్చాడు. తమ మధ్య ఎటువంటి గొడవ జరగలేదని.. ఇప్పటికీ తాము ఫ్రెండ్లీగానే ఉంటామని చెప్పాడు. దీంతో ఈ వివాదానికి తెరపడింది.