Begin typing your search above and press return to search.

'లవ్ స్టోరీ' క్లైమాక్స్ కన్ఫ్యూజన్‌.. అందుకే ఇలా!

By:  Tupaki Desk   |   26 Sep 2021 8:36 AM GMT
లవ్ స్టోరీ క్లైమాక్స్ కన్ఫ్యూజన్‌.. అందుకే ఇలా!
X
నాగ చైతన్య.. సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్ స్టోరీ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా కు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. అయితే రివ్యూవర్స్ మాత్రం సినిమా పర్వాలేదు కాని క్లైమాక్స్ ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండేది అంటూ ఎక్కువ శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తానికి లవ్ స్టోరీ క్లైమాక్స్ విషయంలో ప్రస్తుతం చర్చ జరుగుతోంది. తెలుగు ప్రేక్షకులు యాంటీ క్లైమాక్స్ కు ఒప్పుకోరు అనే ఉద్దేశ్యంతో కథను సుఖాంతం చేయాలని శేఖర్ కమ్ముల భావించాడు. అది మంచి ఉద్దేశ్యమే కాని ఇంకాస్త బెటర్ గా కథను ముగించి ఉంటే బాగుండేది అనేది కొందరి అభిప్రాయం. కొందరు క్లైమాక్స్ విషయంలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నా కొందరు మాత్రం ఏదో మిస్‌ అయ్యిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే క్లైమాక్స్ విషయంలో శేఖర్ కమ్ముల కూడా కన్ఫ్యూజ్‌ అయ్యాడని తెలుస్తోంది. స్వయంగా చిత్ర యూనిట్‌ సభ్యులు క్లైమాక్స్‌ విషయంలో చాలా చర్చలు జరిగాయని అంటున్నారు.

తాజా ఇంటర్వ్యూలో క్లైమాక్స్‌ ను 5 వర్షన్ లలో షూట్‌ చేశారని అంటున్నారు. సినిమా విడుదల ఆలస్యం అవ్వడానికి ప్రథాన కారణం క్లైమాక్స్‌ ను నలుగురు నాలుగు రకాలుగా సూచించడం.. శేఖర్ కమ్ముల కూడా కాస్త కన్ఫ్యూజ్ అయ్యి ఎలా చేయాలో అర్థం కాక చివరకు ఈ వర్షన్‌ ను ఉంచేశారు. శేఖర్‌ కమ్ముల ఈ సినిమాను మొదట అనుకున్న సమయంలో అంతా కొత్త వారితో సినిమాను చేయాలనుకున్నాడు. అప్పుడు క్లీయర్‌ గా సినిమాకు యాంటీ క్లైమాక్స్ పెట్టాలని భావించాడట. కాని స్టార్స్ ఉండటం వల్ల యాంటీ క్లైమాక్స్ వర్కౌట్ అవ్వదని.. ఖచ్చితంగా కథ సుఖాంతం అయితే తప్ప పెట్టిన పెట్టుబడి రావడంతో పాటు నిర్మాతలు మరియు బయ్యర్లు లాభ పడుతారు అనేది చిత్ర యూనిట్‌ సభ్యుల అభిప్రాయం. శేఖర్ కమ్ముల కూడా తన యాంటీ క్లైమాక్స్ ఆలోచన ను నిర్మాతల విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మార్చుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

క్లైమాక్స్‌ విషయంలో దర్శకుడు మొదట అనుకున్నట్లుగానే కన్విన్సింగ్‌ గా ముందుకు వెళ్లి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కాని ఇప్పుడు మాత్రం శేఖర్ కమ్ముల క్లైమాక్స్ విషయంలో ఇంకాస్త బెటర్ గా ఆలోచించి ఉంటే బాగుండేది అనే రివ్యూలు వినిపిస్తున్నాయి. ప్రేక్షకులు ఒక గుడ్‌ ఫీల్ తో బయటకు అయితే వస్తున్నారు కాని క్లైమాక్స్‌ ఏం జరిగింది అనేది క్లీయర్‌ గా లేదు.. చివర్లో హీరోయిన్‌ బాబాయి చావు గందరగోళంగా ఉందని కూడా మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి సినిమా పాజిటివ్‌ రెస్పాన్స్ రావడం.. చాలా రోజుల తర్వాత థియేటర్ల వద్ద జనాలు క్యూలు కడుతున్నారు. చాలా నెలల తర్వాత సినిమా థియేటర్‌ లు హౌస్ ఫుల్‌ అవుతున్నాయి. ఇండస్ట్రీలో మళ్లీ సందడి వాతావరణం మొదలు అయినందుకు గాను సినీ వర్గాల వారు హ్యాపీగా ఉన్నారు. లవ్‌ స్టోరీ ఇచ్చిన ఇన్సిపిరేషన్ తో వరుసగా టాలీవుడ్‌ సినిమాలు విడుదలకు సిద్దం అవుతున్నాయి.