Begin typing your search above and press return to search.
గే కపుల్ కు సమంత అభినందనలు..!
By: Tupaki Desk | 1 Nov 2021 8:56 AM GMTసౌత్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలతో కాకుండా ఇటీవల వ్యక్తిగత జీవితంలో చేసుకున్న పరిణామాలతో వార్తల్లో నిలిచింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అక్కినేని నాగ చైతన్య నుండి విడిపోతున్నట్లు ప్రకటించినప్పటి నుండి సామ్ మీడియా దృష్టిని ఆకర్షించింది. అప్పటి నుండి ఆమె ప్రతి కదలికను అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. ఈమధ్య సోషల్ మీడియాలో సమంత పోస్ట్ చేసే 'మై మమ్మా సెడ్' (మా అమ్మ చెప్పింది) పోస్టులు.. ఆమె వెళ్లిన తీర్థయాత్రల నుంచి దుబాయ్ ట్రిప్ విశేషాల వరకూ అన్నీ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు సామ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఓ ఆసక్తికరమైన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో తొలిసారిగా గే కపుల్ (స్వలింగ సంపర్కుల జంట) పెళ్లి చేసుకోబోతున్నారనే ఓ న్యూస్ క్లిప్పింగ్ ను సమంత షేర్ చేసింది. గత 8 ఏళ్లుగా ప్రేమించుకున్న ఇద్దరు మగవాళ్ళు.. ఈ డిసెంబర్ లో అధికారికంగా పెళ్లి చేసుకోబోతున్న సందర్భంగా ఓ వార్తాపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇప్పుడు గే మ్యారేజ్ చేసుకుంటున్న వారిద్దరినీ ట్యాగ్ చేస్తూ సమంత అభినందనలు తెలిపింది. ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 377 ను సుప్రీంకోర్టు తొలగించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మొదటి స్వలింగ సంపర్క వివాహం ఇదేనని తెలుస్తోంది.
అయితే అగ్ర కథానాయిక సమంత గే మ్యారేజ్ కు సపోర్ట్ చేస్తూ దానికి సంబంధించిన పోస్ట్ ను షేర్ చేయడమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అది కూడా భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత ఇలాంటి పోస్ట్ ఎందుకు షేర్ చేసిందో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే చై సామ్ విడాకుల వ్యవహారంలో సమంత వైపు తప్పుందనే విధంగా అనేక ఊహాగానాలు కథనాలు ప్రసారం అయ్యాయి. యూట్యూబ్ లో అలాంటి వీడియోలను తొలగించాలని కోర్టుకు వెళ్లి విజయం సాధించించింది. అది వేరే విషయం అనుకోండి. కాకపోతే ఇప్పుడు గే కపుల్ కు కంగ్రాట్స్ చెప్పడమే నెటిజన్లకు ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇక సినిమాల విషయానికొస్తే.. గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' సినిమాని పూర్తి చేసింది సమంత. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే విగ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి - నయనతార లతో కలిసి 'కాతువాకుల రెండు కాదల్' అనే తమిళ సినిమా చేస్తోంది. ఈ సినిమా వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. విడాకుల ప్రకటన తర్వాత సమంత రెండు సరికొత్త ప్రాజెక్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దసరా సందర్భంగా అనౌన్స్ చేసిన ఈ రెండూ ద్విభాషా చిత్రాలే అవడం గమనార్హం. త్వరలోనే ఈ సినిమాలు సెట్స్ మీదకు వెళ్లనున్నాయి. అలానే సామ్ బాలీవుడ్ ఎంట్రీకి కూడా ప్లాన్స్ జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి.