Begin typing your search above and press return to search.

వర్మను మెంటల్ ఆసుపత్రిలో చెర్పించాలా?

By:  Tupaki Desk   |   13 Feb 2016 12:41 PM IST
వర్మను మెంటల్ ఆసుపత్రిలో చెర్పించాలా?
X
వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం మీడియాలో నానే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా నిర్మిస్తానని చెబుతున్న వంగవీటి మోహనరంగ జీవిత చరిత్ర సినిమా వ్యవహారం హాట్ హాట్ గా మారింది. ఈ సినిమాపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ ఇష్యూలో ఏపీ కాంగ్రెస్ నేతలు ఎంటర్ అయిపోయారు. ఎందుకంటే.. వంగవీటి సినిమాలో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పాత్ర కూడా ఉంటుందని వర్మ చెప్పటంతో కాంగ్రెస్ కు కాలిపోతోంది.

వర్మ లాంటి వ్యక్తి కానీ సినిమా తీస్తే.. అందులోని పాత్రల కారణంగా ఎలాంటి ఉపద్రవం వచ్చి పడుతుందన్నదే వారి భయంగా తెలుస్తోంది. వంగవీటి చిత్రం మీద గుస్సా ప్రదర్శిస్తున్న విశాఖపట్నం కాంగ్రెస్ నేతలు వర్మకు పిచ్చి పట్టిందని అతన్ని వెంటనే మెంటలాసుపత్రిలో చికిత్స ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. విశాఖ మానసిక చికిత్సాలయ సూపరింటెండెంట్ కు కాంగ్రెస్ నేతలు వినతి పత్రం ఇవ్వటం గమనార్హం. మరి.. ఇలాంటి నిరసనలపై వర్మ ఎలా రియాక్ట్ అవుతారో..?