Begin typing your search above and press return to search.

టీజ‌ర్ టాక్ : వణుకు పుట్టిస్తున్న న‌య‌న్ మూవీ!

By:  Tupaki Desk   |   18 Nov 2022 2:57 PM GMT
టీజ‌ర్ టాక్ : వణుకు పుట్టిస్తున్న న‌య‌న్ మూవీ!
X
లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార నీసెంట్ గా మెగాస్టార్ న‌టించిన `గాడ్ ఫాద‌ర్‌`తో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది. ఈ మూవీ త‌రువాత త‌మిళంలో న‌టించిన హార‌ర్ థ్రిల్ల‌ర్ `క‌నెక్ట్‌. అశ్విన్ శ‌ర‌వ‌ణన్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. రౌడీ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై న‌య‌న‌తార భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. శుక్ర‌వారం న‌య‌న‌తార 38వ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ మూవీ టీజ‌ర్ ని విడుద‌ల చేశారు.

1 మిన‌ట్ 30 సెకన్ ల నిడివితో టీజ‌ర్ ని క‌ట్ చేశారు. చిత్ర ఆకారంలో వున్న ఓ అమ్మాయి త‌న‌ని విడిపించ‌మ‌ని డోర్ కొడుతున్న విజువ‌ల్స్ తో డార్క్ చీక‌ట్లో టీజ‌ర్ మొద‌లైంది. ఆ త‌రువాత న‌ర‌య‌న‌తార‌ను .. అనుప‌మ్ ఖేర్ గైడ్ చేయ‌డం.. చిక‌టి గ‌దిలె వున్న రూపాన్ని చూసి ఒక్క‌సారిగా భ‌యాందోళ‌న‌కు గుర‌వడం.. వంటి స‌న్నివేశాల‌తో టీజ‌ర్ సాగింద‌. చిత్ర‌మైన రూపంతో చీక‌ట్లో క‌నిపిస్తున్న ఆకారం వెన్నులో వ‌ణుకు పుట్టిస్తోంది. అనుప‌మ్ ఖేర్, స‌త్య‌రాజ్, `వాన‌` ఫేమ్ విన‌య్‌ రాయ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

కీల‌క‌మైన అమ్మాయి పాత్ర‌లో హ‌నియా న‌ఫిస్ న‌టించింది. తన పాత్రే ఈ సినిమాకు కీల‌కం. 2015లో అశ్విన్ శ‌ర‌వ‌ణ‌న్ రూపొందించిన `మాయ‌` త‌రువాత న‌య‌న‌తార‌తో క‌లిసి చేస్తున్న రెండ‌వ సినిమా ఇది. ఆత్యంత ఉత్కంఠ‌భ‌రిత స‌న్నివేశాల‌తో ఒళ్లు గ‌గుర్పొడిచే సీన్ ల‌తో వ‌ణుకు పుట్టించేలా ఈ సినిమా వుండ‌నుంద‌ని టీజ‌ర్ తో స్ప‌ష్ట‌మ‌వుతోంది. `కార్తికేయ 2`తో సౌత్ సినిమాల్లో న‌టించ‌డం మొద‌లు పెట్టిన బాలీవుడ్ ప్ర‌ముఖ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ అనుప‌మ్ ఖేర్ చాలా రోజుల త‌రువాత త‌మిళంలో న‌టించిన సినిమా ఇది.

ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. ఆ అంచ‌నాల‌కు ఏమాత్రం తీసిపోని స్థాయిలో టీజ‌ర్ వెన్నులో వణుకు పుట్టించేలా వుండ‌టం గ‌మ‌నార్హం. `డెవిల్ అంత తొంద‌ర‌గా విడిచి వెల్ల‌దు` అనే క్యాప్ష‌న్ తో రూపొందుతున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఈ మూవీతో పాటు మ‌ల‌యాళంలోనూ న‌య‌న‌తార ఓ సినిమా చేస్తోంది.

పృథ్వీరాజ్ సుకుమార‌న్ హీరోగా న‌టిస్తున్న `గోల్డ్‌`లో న‌టిస్తోంది. `ప్రేమ‌మ్‌` డైరెక్ట‌ర్ అల్ఫోన్స్ పుతేరిన్ దాదాపు ఏడేళ్ల విరామం త‌రువాత చేసిన సినిమా ఇది. కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే అక్క‌డ విడుద‌ల కాబోతోంది. ఇక ఇదే ఏడాది న‌య‌న‌తార బాలీవుడ్ కు వెళుతున్న విష‌యం తెలిసిందే. షారుఖ్ ఖాన్ న‌టిస్తున్న `జ‌వాన్‌`లో న‌టిస్తోంది. అట్లీ కుమార్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.