Begin typing your search above and press return to search.
వాజ్ పేయికి కేరళ వరదలకు లికేంటి.?
By: Tupaki Desk | 17 Aug 2018 9:05 AM GMTభారతరత్న - బీజేపీ వ్యవస్థాపకుడు అటల్ బీహారీ వాజ్ పేయి మరణించారు. ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆశ్చర్యకరంగా దక్షిణాదిన కేరళ రాష్ట్రంలో వానలు ముంచెత్తి వరదలు పోటెత్తుతున్నాయి. దాదాపు 100 మంది మరణించారు. గడిచిన 100 ఏళ్లలో ఇంతటి వరద బీభత్సం ఎదురుకాలేదని కేరళ వాసులు అంటున్నారు. వాజ్ పేయి మరణించిన రోజే వరద ఉధృతి ఎక్కువైపోయింది. అసలు వాజ్ పేయికి - కేరళ వరదలకు లింక్ ఉన్నదని తాజాగా ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది.
వాజ్ పేయి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ లో 1924 డిసెంబర్ 25న జన్మించారు. వాజ్ పేయి పుట్టిన సమయానికి కేరళలో అప్పటివరకూ ఎన్నడూ లేని వరదలు ముంచెత్తాయి. ఆ వరదల ధాటికి చాలామంది చనిపోయారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. మూడు వారాల పాటు పెరియన్ నది ఉగ్రరూపం దాల్చింది. కేరళ రాష్ట్రం మొత్తం వరదలతో అతలాకుతలం అయ్యింది. ఎటూ చూసినా వరద నీరేనట.. ఊళ్లకు ఊళ్లు మునిగిపోయాయి. వరదలకు కరింతిరి మలై అనే కొండ కూడా కొట్టుకుపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు దాదాపు వందేళ్లకు దగ్గరవుతోంది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అదే వాజ్ పేయి మరణానికి అటు ఇటుగానే కేరళను వరదలు ముంచెత్తాయి. ఇంత కాలానికి కేరళను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ వరదలను వందేళ్ల కింద వచ్చిన వరదలు ఒక్క రకంగానే ఉన్నాయని.. దీన్ని గ్రేట్ ఫ్లడ్ గా మలయాళీలు అభివర్ణిస్తున్నారు. నాటి కేరళ వరదల సమయంలో వాజ్ పేయి జన్మించాడని.. నేటి వరదల సమయంలో ఆ నేత కన్నుమూశారని చెబుతున్నారు. దీంతో వాజ్ పేయికి, కేరళ వరదలకు ఏంటా సంబంధం అని అందరూ ఆశ్చర్యపోతున్నారు..