Begin typing your search above and press return to search.

యంగ్‌ హీరో వెనుక కుట్ర జరుగుతుందట!

By:  Tupaki Desk   |   10 Feb 2023 3:00 PM GMT
యంగ్‌  హీరో వెనుక కుట్ర జరుగుతుందట!
X
రాజావారు రాణిగారు సినిమాతో యూత్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన కిరణ్ అబ్బవరం ఎస్ఆర్ కళ్యాణమండపం చిత్రంతో కమర్షియల్‌ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అప్పటి నుండి కూడా కిరణ్‌ అబ్బవరం సినిమా అనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తోంది.

ఇటీవల ఆయన ఆశించిన స్థాయిలో సక్సెస్ లను సొంతం చేసుకోలేక పోయాడు. కానీ త్వరలో రాబోతున్న 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమా తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోబోతున్నట్లుగా నమ్మకం వ్యక్తం అవుతోంది.

అల్లు అరవింద్‌ కాంపౌండ్ నుండి రాబోతున్న సినిమా అవ్వడంతో పాటు తాజాగా విడుదల అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌ తో రూపొందిన ఈ సినిమా యూత్ కు కనెక్ట్‌ అయ్యే విధంగా ఉంది. సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో కిరణ్ అబ్బవరం మరింత జోష్ తో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.

తాజాగా సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. తన గురించి సోషల్‌ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తన గురించి వెనుక కుట్ర జరుగుతుంది అంటూ ఆరోపించాడు. కిరణ్ అబ్బవరం ను కిందకు లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట.. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే అంటున్నాడు.

కిరణ్ అబ్బవరం ను కిందకి లాగేది ఎవరు.. ఎవరికి ఆ అవసరం ఉందంటూ ఒక వర్గం సోషల్‌ మీడియా జనాలు చర్చ మొదలు పెట్టారు. పెద్ద ఎత్తున వినరో భాగ్యము విష్ణు కథ సినిమా యొక్క ప్రమోషన్‌ కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో మంచి స్పందన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కిరణ్ అబ్బవరం మంచి సినిమాలు చేస్తే కచ్చితంగా జనాలు ఆదరిస్తారు.. ఎవరో వెనక్కి లాగినా కూడా ఏం జరగదు.. కనుక మంచి కథలు ఎంపిక చేసుకుని ముందుకు వెళ్లడం ఉత్తమం. ప్రేక్షకులు తన నుండి ఎలాంటి కథలు కోరుకుంటున్నారో గుర్తించి కిరణ్‌ అబ్బవరం ఆ తరహా కథలు ఎంపిక చేసుకోవాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.