Begin typing your search above and press return to search.
యాంకర్ కం నటి కెరీర్ ని దెబ్బ కొట్టేందుకు కుట్ర?
By: Tupaki Desk | 9 Sep 2022 6:31 AM GMTప్రముఖ తెలుగు యాంకర్.. నటి అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తున్న వారిని తన వయస్సును అవమానపరిచేవారిని తీవ్రంగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. తనను తప్పుడు వ్యాఖ్యలతో వేధించిన వారిని జైల్లో వేయిస్తానని పోలీసులు తొందరలోనే బుద్ధి చెబుతారని కూడా వార్నింగ్ ఇచ్చారు. ఆత్మగౌరవం కాపాడుకునేందుకు తాను ఎంత దూరమైనా వెళతానని పరోక్షంగా అనసూయ హెచ్చరించారు. నా కెరీర్ ని దెబ్బ కొట్టేందుకు కుట్ర చేసారని.. అలాంటి వారిని వదిలి పెట్టనని వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
సోషల్ మీడియాలను దుర్వినియోగం చేస్తున్న ప్రతి ఖాతా స్క్రీన్ షాట్ ను తీసానని.. సదరు దుర్వినియోగ ట్వీట్లు చేసిన వినియోగదారుపై కేసు పెడతానని ఆమె ట్రోలర్ లను హెచ్చరించింది. అనసూయ ఇంతకుముందు దేవరకొండను ఉద్ధేశిస్తూ ట్వీట్ చేయడంతో ఈ ఘర్షణ ప్రారంభమైంది. దేవరకొండ లైగర్ ప్రతికూల సమీక్షలకు తెరతీసిన సమయంలో అనసూయ నెగెటివ్ ట్వీట్ చేయడంతో విజయ్ ఫ్యాన్స్ లో వీరంగం బయటపడింది.
"తల్లి(తెరపై)ని అలా బూతులు తిట్టినందుకు కర్మ సిద్దాంతాన్ని అనుసరించాల్సిందే. కర్మ ఎప్పుడూ వెంటాడుతుంది"అని అనసూయ ట్వీట్ చేసింది. దాంతో అది లైగర్ పాత్రధారి దేవరకొండనుద్ధేశించి ట్వీట్ చేసిందని వీడీ అభిమానులు నమ్మారు. తన ట్వీట్ పై ఘాటుగా స్పందించారు. రకరకాల బూతులు తిట్టేసారు.
"నేను ప్రతి దుర్వినియోగాన్ని రీట్వీట్ చేస్తూనే ఉంటాను. ఆమె గౌరవం కోసం నిలబడే మహిళకు ఏమి జరుగుతుందో దానికి నిదర్శనం. #SayNOtoOnlineAbuse" అంటూ ఆ తర్వాత అనసూయ వివాదాన్ని కొనసాగించారు. ఈ వేదికలపై నన్ను దుర్వినియోగం చేస్తున్న ప్రతి ఖాతా స్క్రీన్ షాట్ తీసాను.. అని అన్నారు. ఆ తర్వాత గొడవ మరో రూపం తీసుకుంది. అనసూయను అంటీ అంటూ దారుణంగా ట్రోల్ చేసారు విజయ్ అభిమానులు. అదే క్రమంలో నన్ను 'ఆంటీ' అని పిలుస్తూ అవమానించారు. నా వయస్సును ప్రస్థావిస్తూ అవమానించారు. ఇందులో నా కుటుంబాన్ని లాగారు. అందుకే నేను కేసు నమోదు చేస్తున్నాను. మీరు నాతో పెట్టుకున్నందుకు చింతించే స్థాయికి తీసుకెళతాను. ఏదైనా చట్టబద్ధంగా చేస్తాను.. ఇది నా ముగింపు..."అని అనసూయ ఎమోషనల్ అయ్యారు.
"అలాగే మీరు ఏమి చేస్తున్నారో మీరు గ్రహించే వరకు ప్రతి దుర్వినియోగాన్ని రీట్వీట్ చేస్తూ ఉంటాను. నేను ఎందుకు చేస్తున్నానో గ్రహించండి. నేను పిరికిదానిని కాదు. 'అభిమానుల' వెనుక దాక్కున్నాను. నా ఇమేజ్ ను దెబ్బ కొట్టడానికి కుట్ర చేస్తూ నా నకిలీ ప్రొఫైల్ లను చెల్లించి ఇన్నాళ్లూ హ్యాష్ ట్యాగ్ చేయడం నాకు తెలుసు. అందరికీ ఇక చెక్ పెడతాను.." అంటూ ఆమె ఘాటుగానే స్పందించారు.
అనసూయ భరద్వాజ్ -విజయ్ దేవరకొండ అభిమానుల మధ్య వివాదం ట్విట్టర్ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపింది. గత కొద్ది రోజులుగా ఈ వివాదం ముదురుతోందే కానీ ఎక్కడా తగ్గడం లేదు. తద్వారా సోషల్ మీడియాల్లో అనసూయ ఇమేజ్ కూడా అసాధారణంగా పెరుగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.