Begin typing your search above and press return to search.
#BIGGBOSS5TELUGU : కంటెట్ క్రియేటర్లు ఎక్కువ అయ్యారు బాబోయ్
By: Tupaki Desk | 9 Sep 2021 8:30 AM GMTబిగ్ బాస్ హౌస్ అంటే అన్ని రకాల వారు ఉంటారు. కొందరు మూడీగా ఉంటే కొందరు జాలీగా ఉంటారు.. కొందరు రిజర్వడ్ గా ఉంటారు. కొందరు మరీ హైపర్ గా ఉంటే కొందరు దూకుడుగా ఉంటారు. ఇక కొందరు ఎక్కువగా కెమెరా దృష్టిని ఆకర్షించేందుకు గాను ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కెమెరా ఎక్స్ పోజ్ కోరుకునే వారి గురించి హౌస్ లో ఎక్కువగా చర్చ జరుగుతుంది. వారు కోరుకునేది కూడా అదే కనుక కొన్ని సార్లు అది తప్పుగా కూడా మారే అవకాశం ఉంటుంది. ఎక్కువగా కంటెంట్ ఇవ్వాలనుకునే వారు చేసే పనులు వారు చూపే అత్యుత్సాహం ఇతర ఇంటి సభ్యులకు మరియు ప్రేక్షకులకు కూడా కొన్ని సార్లు చికాకును కలిగిస్తుంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న వారిలో కొందరు మరీ ఎక్కువగా కంటెంట్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
హైపర్ యాక్టివ్ తో బిగ్ బాస్ హౌస్ లో మొదటి కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన సిరి పదే పదే అందరి దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఆమె ఇప్పటి వరకు ప్రసారం అయిన ఎపిసోడ్ లో దాదాపు అన్ని ఎపిసోడ్ లో కూడా ప్రముఖంగా కనిపించింది. కారణం ఆమె కాస్త అతిగా ప్రవర్తిస్తుంది. మొదటి ఎపిసోడ్ లో ఇతరుల వస్తువులు దాచేసి డ్రామా ఆడే ప్రయత్నం చేసింది.. ఆ తర్వాత లోబోతో కలిసి ప్రాంక్ చేసేందుకు ప్రయత్నించింది. ఇంకా పనుల్లో స్పీడ్ గా ఉండటం టాస్క్ కోసం కష్టపడటం వంటివి చూస్తే ఆమె ఎంతగా కంటెంట్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తుందో అర్థం చేసుకోవచ్చు. సిరి తో పాటు మొదటి నుండి కూడా కాజల్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆమె కూడా కంటెంట్ క్రియేటర్ గా పేరు దక్కించుకుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
వీరిద్దరు మాత్రమే కాకుండా లహరి మరియు జెస్సీలు కూడా కంటెంట్ క్రియేట్ చేసి జనాల దృష్టిలో పడాలని భావిస్తున్నారు. కొందరు ఎవరితో గొడవ పెట్టుకోకుండా సైలెంట్ గా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. యాంకర్ రవి తనకు అవకాశం వచ్చిన సమయంలో ఖచ్చితంగా కంటెంట్ ను ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు మాత్రం అస్సలు కెమెరాకే చెక్కడం లేదు. అందులో షన్ముఖ్ ఒకరు కాగా నటరాజ్ మాస్టర్ కూడా పెద్దగా కనిపించడం లేదు. సన్నీ కూడా కాస్త హడావుడి చేస్తున్నాడు. ఇక మానస్ కూడా యావరేజ్ గానే యాక్ట్ చేస్తున్నారు. విశ్వ సింపథీ కోసం ప్రయత్నిస్తుంటే.. ప్రియాంక ప్రత్యేకంగా కనిపించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. మొత్తానికి మొత్తం హౌస్ లో ఉన్న వారిలో కంటెంట్ క్రియేటర్లు చాలా మందే ఉన్నారు. వారికి మొదటి వీకెండ్ తర్వాత క్లారిటీ వస్తుంది. నాగార్జున నుండి వచ్చే పంచ్ లు స్పందన ద్వారా వారు తమ తీరును వచ్చే వారం నుండి మార్చుకుంటారేమో చూడాలి.