Begin typing your search above and press return to search.
నం1 నం2 మనమే.. బాలీవుడ్ స్టార్ల ఏడుపే ఏడుపు!
By: Tupaki Desk | 6 May 2022 12:30 AM GMTనంబర్ గేమ్ ఇంతకుముందు ప్రాంతీయంగా ఉండేది. కానీ ఇప్పుడు జాతీయం అయ్యింది. ప్రాంతాల మధ్య వాగ్వాదాల్లేవు ఇప్పుడు .. డైరెక్టుగా జాతీయ మీడియానే చెప్పుకునేలా సౌత్ వెళ్లి నార్త్ ఇండస్ట్రీని గడగడలాడిస్తోంది. ఇప్పటికిప్పుడు దేశంలో నం 1 .. నంబర్ 2 సినిమాలు మనవే. మన హీరోలే టాప్ 1 టాప్ 2 గా రికార్డుల్లో ఉన్నారు. ఈ గ్రాఫ్ మునుముందు ఇంకా ఇంకా స్కైని టచ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇప్పటివరకూ ఈ వ్యవహారాన్ని జీర్ణించుకునేందుకు బాలీవుడ్ దిగ్గజాలు సైతం సిద్ధంగా లేరు. ఖాన్ ల త్రయం సహా కుమార్ లు కపూర్ లు దేవగన్ లు వగైరా వగైరా పెద్దలెవరూ దీనిని అంగీకరించడం లేదు. అక్షయ్ కుమార్ - అజయ్ దేవగన్ - జాన్ అబ్రహాం ఇప్పటికే నీళ్లు నమిలారు. ఇప్పుడు ప్రతిభావంతుడైన B-టౌన్ నటుడు నవాజుద్దీన్ సైతం దొరికిపోయాడు. RRR అలాగే KGF 2 రికార్డులను అతడు పరోక్షంగా మాటల్లో టచ్ చేసాడు. దక్షిణాది గొప్ప ఏంటీ అనేలా మాట్లాడాడు.
ఇటీవల విడుదలైన RRR -KGF 2 చిత్రాలు నార్త్ బెల్ట్ లో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాయి. సినిమాలకు వస్తున్న రెస్పాన్స్ .. కలెక్షన్స్ తో సౌత్ ఫిల్మ్ డమ్ చాలా సంతోషంగా ఉండగా బాలీవుడ్ లోని కొన్ని వర్గాలు కలత చెందుతున్నాయి. అంతేకాదు.. చాలా అసంతృప్తితో రగిలిపోతున్నారు కొందరైతే. ఇటీవల జాన్ అబ్రహం -అజయ్ దేవగన్ సామాజిక మాధ్యమాల్లో పెద్ద డిబేట్ కి కారకులయ్యారు. ప్రాంతీయ తత్వం భాషా భేధం సహా చాలా విషయాలు డిబేట్ కి వచ్చాయి. ఇది చివరకు విజయవంతమైన సౌత్ చిత్రాలకు కావాల్సినంత ప్రచారం దక్కేలా చేసింది. తాజాగా మరో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ దక్షిణాది నుండి వచ్చిన రెండు పాన్ ఇండియా చిత్రాలపైనా పరోక్షంగా విరుచుకుపడ్డాడు.
సూపర్ టాలెంటెడ్ నవాజుద్దీన్ సిద్దిఖీ 'హీరోపంతి 2' లో నటించిన సంగతి తెలిసిందే. ప్రమోషన్స్ సమయంలో RRR -KGF చాప్టర్ 2 వంటి చిత్రాల ఆధిపత్యం తర్వాత బాలీవుడ్ అభద్రతాభావంతో ఉందా అని మీడియా అతడిని ప్రశ్నించగా డిపెండ్ చేసుకునే ప్రయత్నంలో పడిపోయాడు. అతను దానిని ట్రెండ్ అని లైట్ తీస్కున్నట్టుగా మాట్టాడాడు. ప్రజలు వసూళ్ల కంటే ఎక్కువ సినిమాల్ని ప్రశంసించారు.
అది విజయవంతమైనప్పుడు అర్హమైనది... అన్నాడు. ఒక సినిమా బాగా వచ్చినప్పుడు అందరూ ఒక దగ్గరికి చేరి దాని అర్హత కంటే ఎక్కువగా ప్రశంసిస్తారు. అదే విధంగా ఒక సినిమా హిట్ కాకపోతే ప్రజలు దానిని విమర్శించాల్సిన దానికంటే ఎక్కువగా విమర్శిస్తారు... అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేసాడు. సౌత్ గొప్పతనాన్ని అంగీకరించేందుకు అతడికి మనస్కరించలేదు. బాలీవుడ్ నుండి ఒక పెద్ద హిట్ వస్తే అది ఈ చర్చను మరోసారి మారుస్తుందని నవాజుద్దీన్ అభిప్రాయపడ్డాడు. అది ఫ్యాషన్ లాంటిదని చెప్పాడు. హీరో పంథి 2 ఫెయిల్యూర్ అంటూ మీడియా ప్రస్థావించడంతో నవాజుద్దీన్ ఏదోలా కవరింగ్ కి ప్రయత్నించాడు.
దక్షిణాది సత్తా చాటుతుంటే చూడడం తప్ప బాలీవుడ్ వాళ్లు చేయగలిగింది ఏదీ లేదు. ఎందుకంటే అక్కడ తెరకెక్కేవి.. అక్కడ స్టార్లతో తీసేవి ఎప్పటికీ తెలుగు - తమిళం సౌత్ లో ఆడవు. అందువల్ల అవి పాన్ ఇండియా సినిమాలు కాలేవు. ఈ విషయం వారికి బాగా తెలుసు. ఇక కొందరు సౌత్ కి పడి ఏడుస్తుంటే.. అనుపమ్ ఖేర్ - అనిల్ కపూర్ వంటి నిజాయితీ పరులైన స్టార్లు ఇటీవల RRRని వీక్షించారు. దానిపై ప్రశంసల వర్షం కురిపించారు. విద్యుతీకరణ అంటూ అద్భుత పదజాలంతో పొగిడేసారు. తెలుగు-కన్నడ సినిమా ఘనతను కొన్ని బాలీవుడ్ మీడియాలు ఆకాశానికెత్తేస్తుంటే.. కొన్ని జాతీయ(ముంబై) మీడియాలు ఇంకా బింకాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇదంతా మన గొప్ప అని డబ్బాలు కొట్టడం లేదు కానీ.. తగ్గేదేలే! అంటూ ఇకమీదటా ఢీకొట్టడానికి సౌత్ సై అనేస్తోంది. ఉత్సాహంతో మోరలెత్తి ఉరకలెత్తుతోంది.