Begin typing your search above and press return to search.
మురళీధరన్ బయోపిక్ చూశాక అన్ని డౌట్లు పరార్ అన్నాడు!
By: Tupaki Desk | 15 Oct 2020 4:45 AM GMTశ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ పై బయోపిక్ ప్రయత్నం పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 800 అనే టైటిల్ తో మోషన్ పోస్టర్ విడుదల కావడంతో హీరో విజయ్ సేతుపతికి ఇబ్బందులు తప్పలేదు. `షేమ్ ఆన్ విజయ్సేతుపతి` హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. శ్రీలంకలో తమిళుల్ని ఊచకోసారు. అలాంటి దేశానికి ప్రాతినిథ్యం వహించిన క్రికెటర్ పై సినిమా తీస్తారా? ఇది షేమ్ కాదా? అంటూ తిట్ల దండకం అందుకున్నారు ట్వీట్లలో.
ఇది రాజకీయరంగును పులుముకుంది. తమిళనాడులోని పలు రాజకీయ పార్టీల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఆఫ్ బీట్ పాత్రలతో మెప్పిస్తున్న ప్రముఖ హీరో విజయ్ సేతుపతి (44) బయోపిక్ 800 లో ముత్తయ్య మురళీధరన్ పాత్రను పోషించడం చాలా మందికి నచ్చడం లేదు. తమిళ తిరుగుబాటుదారులు (ఉత్తరం.. తూర్పు నుండి) మరియు సింహళ మెజారిటీ ప్రభుత్వాల మధ్య అంతర్యుద్ధంపైనా.. శ్రీలంక ద్వీపం మధ్య ప్రాంతమైన కాండీలోని టీ ఎస్టేట్ నుండి మురళీ తమిళ పిల్లవాడిగా జనించిన విధానంపైనా ఎదుగుదలపైనా ఈ చిత్రం తెరకెక్కనుంది.
విజయ్ సేతుపతి కథానాయకుడిగా గత ఏడాది ఈ చిత్రాన్ని ప్రకటించినప్పుడు 2009 లో ఎల్‌టిటిఇకి వ్యతిరేకంగా జరిగిన యుద్ధం లో తమిళులపై మారణహోమం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజపక్సే ప్రభుత్వానికి మురళి మద్దతుదారుడని పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. ఆ సమయంలో సేతుపతి ``నన్ను ప్రేమించే ప్రజల మద్దతును కోల్పోవటానికి ఇష్టపడను`` కాబట్టి తమిళులను బాధించే దేనినీ ఈ చిత్రం చూపించదని ప్రకటించాడు.
తాజాగా మోషన్ పోస్టర్ విడుదల వేళ తమిళ కార్యకర్తలు .. నెటిజనులు మరోసారి రాజపక్సే అనుకూల వ్యాఖ్యలను గుర్తుచేసుకున్నారు. మురళి గతంలో ఎల్‌టిటిఇపై సైనిక చర్యకు ఆయన మద్దతు తెలిపారు. ``తమిళులు మరియు తమిళ మత్స్యకారులను ఊచకోత కోసిన ప్రభుత్వానికి ఇది మద్ధతుగా నిలిచింది`` అని అంతా వ్యతిరేక నినాదాలు చేసారు. సేతుపతి శ్రీలంక జెండాతో తెల్లటి టీ షర్టును ఎలా ధరించగలరని వారిలో చాలామంది ప్రశ్నించారు. ఈ చిత్రం నుండి సేతుపతిని వైదొలగాలని విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి సందేశాలతో సోషల్ మీడియాలో వరదలా కట్టలు తెంచుకున్నాయి.
వచ్చే ఏడాది నుండి శ్రీలంక,.. ఇండియా,... యు.కె .. ఆస్ట్రేలియాలో చిత్రీకరించాలన్నది ప్లాన్. ఈ బయోపిక్ 2021 చివరి నాటికి విడుదల కానుంది. అన్ని దక్షిణ భారత భాషలతో పాటు హిందీ,.. బెంగాలీ సింహళ భాషలలో కూడా డబ్ చేయబడుతుంది. ఇంగ్లీష్ ఉపశీర్షికలతో అంతర్జాతీయ వెర్షన్ కూడా ప్లాన్ చేస్తున్నారట.
సేతుపతి మొదటి చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు సీను రామస్వామి కూడా బయోపిక్ లో నటించడాన్ని పునః పరిశీలించాలని నెటిజనులు కోరారు. మురళి ఒకప్పుడు రాజపక్సేను “శ్రీలంక కు చెందిన నెల్సన్ మండేలా” అని అభివర్ణించారని,.. అతన్ని తమిళుల శత్రువుగా అభివర్ణించారని విసికె ప్రతినిధి వన్నీ అరసు గుర్తు చేసుకున్నారు. శ్రీలంక ప్రధానమంత్రి కుమారుడు నలన్ రాజపక్సే ఈ బయోపిక్ పై ట్వీట్ చేయడం వల్ల లంక వ్యతిరేక లాబీ మరింత ఆగ్రహానికి గురయ్యింది. ఈ చిత్ర పోస్టర్ లో మురళికి పోలికలున్నందుకు సేతుపతిని అభినందించారు ఆయన.
అయితే ఈ టెన్షన్ల నడుమ 800 దర్శకనిర్మాతలు వివరణలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. 800 దర్శకుడు శ్రీపతి మాట్లాడుతూ..... సేతుపతి సమాజంలోని ఏ వర్గానికీ బాధ కలిగించేలా ఏ చిత్రంలోనూ నటించరని వివరించారు. ``చిత్రం విడుదలైనప్పుడు ఈ సందేహాలన్నీ మాయమవుతాయి`` అని ఆయన అన్నారు. చెన్నైకి చెందిన తమిళ డాక్టర్ దంపతుల కుమార్తెను వివాహం చేసుకున్న మురళి ప్రస్తుతం ఐపిఎల్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ కు బౌలింగ్ కోచ్ గా ఉన్నారు. ఇది సన్ టివికి చెందిన కళానిధి మారన్ యాజమాన్యంలో ఉంది.