Begin typing your search above and press return to search.
ఆరెస్ట్ చేయడానికి వస్తే ఇంట్లోనే `మూడ్`తుందా?
By: Tupaki Desk | 25 Nov 2021 6:14 AM GMTబాలీవుడ్ నటి కంగనా రనౌత్ వివాదాస్పద వైఖరి.. ఎటాకింగ్ కామెంట్స్ ప్రభావం ఏ రేంజులో పని చేస్తుందో చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద అంశంతో మీడియాలో కంగన పేరు హైలైట్ అవుతుంటుంది.
ఇటీవల పద్మశ్రీ అవార్డుల సమావేశం అనంతరం దేశానికి స్వాతంత్య్రం 2014లోనే వచ్చిందని.. 1947 లో భారతదేశానికి లభించిన స్వాతంత్య్రం బ్రిటీష్ వాళ్లు బిక్షగా వేసి పోయారని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాల్ని అర్పించిన వారి పట్ల అవమానకరంగా మాట్లాడిందని మండిపడ్డారు. కంగన తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు.
అలాగే ఆమె అందుకున్న పద్మశ్రీ అవార్డుని కేంద్రం వెంటనే రద్దు చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. మహత్మా గాంధీ- స్వాతంత్య్ర ఉద్యమంపై పరువు నష్టం కల్గించే వ్యాఖ్యలు చేసినందుకు అస్సాంలోని ఆరుగురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోలీసులకు ఫిర్యాదులు చేసారు.
అయితే కంగన మాత్రం ఈ వ్యాఖ్యలపై ఏమాత్రం బెదరలేదు. వీటిని చాలా లైట్ తీసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫోటోని షేర్ చేసింది. ఆమె బ్యాక్ లెస్ బ్లాక్ డ్రెస్ లో థై అందాలు ఎలివేట్ అయ్యేలా ఉన్న దుస్తుల్లో తన బ్యాక్ ని హైలైట్ చేసింది. చేతిలో గాజు గ్లాస్ పట్టుకుని కుడి కాలిని పైకెత్తి కెమెరాకి ఫోజులిచ్చింది.
ఇంత వరకూ బాగానే ఉంది. మళ్లీ ఇక్కడ ఈ ఫోటోని ఉద్దేశించి ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. `మరొక రోజు..మరొక ఎఫ్ ఐఆర్`. ఒక వేళ వాళ్లు నన్ను ఆరెస్ట్ చేయడానికి వస్తే ఇంట్లో మూడ్`` అని రాసుకొచ్చింది. నన్ను ఆరెస్ట్ చేయడానికి వస్తే ఇంట్లోనే `మూడ్` వస్తుందనేది కంగన ఉద్ధేశమా.. లేక మూడుతుందనేది తన ఉద్ధేశమా? అన్నది ఎవరికీ అర్థం కాలేదు.
మరీ ఇంత ఘాటుగా కంగన ఇలా క్యాప్షన్ ఇవ్వడంతో ఖంగుతిన్న కాంగ్రెస్ వాదులు ఉద్దేశ పూర్వకంగానే ఇలా టీజ్ చేసిందని మరోసారి భగ్గుమన్నారు. బహిరంగంగా క్షమాపణలు చెప్పకపోతే వివాదం చాలా పెద్దది అవుతుందని హెచ్చరించారు. మరి కంగన ఈసారి ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.