Begin typing your search above and press return to search.

అమ్మాయిలను అవమానిస్తూ అ..ఆ డైలాగ్స్

By:  Tupaki Desk   |   6 Jun 2016 4:54 AM GMT
అమ్మాయిలను అవమానిస్తూ అ..ఆ డైలాగ్స్
X
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ - సమంత జంటగా అ..ఆ.. చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. అంచనాలకు మించి పెర్ఫామ్ చేస్తోంది. సమ్మర్ సీజన్ చివర్లో ప్రేక్షకులను విపరీతంగా ఎంటర్టెయిన్ చేస్తున్న సినిమా కావడంతో.. ఆడియన్స్ క్యూ కట్టేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాకి ఏ మాత్రం తగ్గకుండా పెర్ఫామ్ చేస్తున్న అ..ఆ..లో మహిళలను అవమానించే డైలాగ్స్ ఉండడం, అవి గృహహింసను ప్రోత్సహించేలా ఉండడం.. చాలామందిని నొచ్చుకునేలా చేస్తోంది.

అ..ఆ.. క్లైమాక్స్ సీన్ లో హీరో నితిన్ 'నాకు కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలీదు' అన్నపుడు.. 'ఇందాక ఆ డోర్ ని తన్నినంత గట్టిగా మాత్రం తన్నద్దు' అని సమంత అంటుంది. అంటే దీనర్ధం.. మెల్లగా కొట్టినా పర్లేదు గట్టిగా మాత్రం కొట్టద్దు అన్ని చెప్పడమే. అసలు భార్యను కొట్టడం అంటే గృహహింస కిందకు వస్తుంది. హ్యూమన్ వాల్యూస్ పై క్లాసులు పీకే త్రివిక్రమ్ సినిమాలో.. భార్యను కొట్టడం గురించి లీడ్ కేరక్టర్లే ఎంకరేజ్ చేసేలా మాట్లాడ్డం మాత్రం అభ్యంతరకరమే.

ఇక క్లైమాక్స్ పూర్తయ్యాక.. రావు రమేష్ చాలా కామెడీ పంచ్ లు పేలుస్తాడు. హీరో పెళ్లయిపోయినా ఇంకా తన కోసం వెయిట్ చేస్తానని కూతురు చెప్పడంతో.. 'శత్రువులంటే ఎక్కడో ఉండర్రా.. ఇదుగో.. కూతుళ్లు - చెల్లెళ్లు అని మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు' అని అంటాడు. ఓ పాత్ర గురించి చెప్పడానికి ఇలా మహిళలు అందరినీ ఉద్దేశించి చెప్పడం కూడా ఎంతో మందిని బాధపెట్టింది.