Begin typing your search above and press return to search.

కల్యాణీ అక్క ఎక్కడ..??

By:  Tupaki Desk   |   16 May 2022 11:30 AM GMT
కల్యాణీ అక్క ఎక్కడ..??
X
కరాటే కల్యాణీ అలియాస్ కాంట్రావర్షియల్ కల్యాణీ ఎక్కడ ఉన్నా సంచనాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది. గత కొంతకాలంగా నిశబ్ధంగా ఉన్న వివాదాస్పద నటి.. ఇటీవల యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి పై దాడి ఘటనతో వార్తల్లో నిలిచింది. గత మూడు రోజులుగా ఇదే చర్చనీయాంశంగా కొనసాగుతోంది.

ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలను కించపరుస్తున్నాడంటూ శ్రీకాంత్ పై కల్యాణీ దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అతన్ని బెదిరించడానికి వెళ్లిన కల్యాణీ ముందుగా చెంప మీద కొట్టడం.. పక్కనే ఉన్న ఆమె మనిషి కూడా కొట్టడం అందులో కనిపించింది.

ఈ క్రమంలో స్క్రిప్టెడ్ ప్రాంక్ వీడియోలు చేసుకునే శ్రీకాంత్ కూడా వారిపై తిరగబడినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే కల్యాణీ మాత్రం ప్రతీ మీడియా ఛానల్ లో నేను వాడిని కొట్టాను.. తగలరాని చోట తన్నితే చెప్పుకోడానికి బాధ పడుతున్నాడు అంటూ ఏది పడితే అది మాట్లాడటం గత రెండు రోజులుగా విపరీతంగా ట్రోల్ అవుతోంది.

కొత్త వెర్సన్ ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ చానల్స్ మరియు టీవీలలో కల్యాణీ ఔట్ డేటెడ్ కాబట్టి.. ఆమెకు మీడియా అటెన్షన్ కోసం ఇలా చేసిందని అంటున్నారు. అలానే చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని.. నేరుగా కొంతమందిని వెంటేసుకొని వెళ్లి డబ్బులు గుంజాలని ప్లాన్ వేసిందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

కల్యాణీ నిజంగానే యూట్యూబర్ తో మాట్లాడటానికి వెళ్లుంటే.. అంత మంది ఆమె వెంట ఎందుకు ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ప్రాంక్ వీడియోల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న అమ్మాయిలు లేదా బాధితురాళ్లు ఆమెను ఆశ్రయిస్తే.. అండగా నిలబడి పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండొచ్చు.

కానీ అలా పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా.. ఆమే స్వయంగా అతని వద్దకు ఎందుకు వెళ్ళింది? అక్కడ ఎందుకు అంత రచ్చ చేసింది? అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు కల్యాణీ మీద సరైన యాక్షన్ తీసుకోకపోతే.. రాబోయే రోజుల్లో ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉందని అంటున్నారు.

అంతేకాదు ఆమె ఇంటర్వ్యూ వీడియోలలో వెనుక ఉన్నవారు ఎవరు? నిజంగానే వాళ్లంతా సామాజిక సేవా కార్యకర్తలేనా? లేదా మరెవరైనానా అనేది ఆరా తీయాలని సూచిస్తున్నారు. యూట్యూబర్ తో గొడవ రచ్చకెక్కగా.. కరాటే కల్యాణీ ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వహించడం కలకలం రేపింది.

కల్యాణి పలువురు చిన్నారులతో పాటు 2 నెలల పసి పిల్లలను కొనుగోలు చేసినట్లుగా 1098 నంబరు ద్వారా ఫిర్యాదులు వచ్చినట్లు చైల్డ్ వెల్ఫేర్ అధికారులు పేర్కొన్నారు. పిల్లలను అడ్డుపెట్టుకుని డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వచ్చాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని కల్యాణి నివాసంలో ఆమె తల్లి విజయలక్ష్మి మరియు సోదరుడిని పోలీసుల సహకారంతో ప్రశ్నించారు.

అయితే ఆమె తల్లి మాత్రం పాపను న్యాయబద్ధంగానే దత్తత తీసుకుందని తెలిపారు. కల్యాణీ ఎలాంటి తప్పు చేయలేదని.. ఆమెకు సామాజిక సేవ అంటే ఇష్టమని.. అందుకే అనాధలను.. తల్లిదండ్రులు లేని పిల్లలను ఆదరిస్తుందని చెబుతున్నారు. ఒకవేళ నిజంగా ఆమె అనాథ పిల్లలకు ఆశ్రయం ఇస్తుంటే.. సేవాగుణాన్ని అందరూ అభినందించాలి.

కాకపోతే అధికారులు విచారణ జరుగుతున్న సమయంలో కరాటే కల్యాణి మరియు పాప ఇంట్లో లేకపోవడం పలు అనుమానాలకు దారి తీసింది. చైల్డ్ లైన్ ప్రొటెక్షన్ స్కీం అధికారులు నోటీసులు ఇచ్చినా.. దీనిపై ఆమె నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఆమె ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. తప్పు చేయకపోతే అధికారులకు భయపడి ఎందుకు పారిపోయింది అనే ప్రశ్నలు వస్తున్నాయి. మొత్తానికి కరాటే కళ్యాణీ యాటిట్యూడ్ ఆమె కొంప ముంచినట్లుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.