Begin typing your search above and press return to search.

ఆర్ఆర్‌ఆర్ కి బాబు గోగినేని వివాదాస్పద రివ్యూ

By:  Tupaki Desk   |   27 March 2022 9:31 AM GMT
ఆర్ఆర్‌ఆర్ కి బాబు గోగినేని వివాదాస్పద రివ్యూ
X
జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమాకు పాజిటివ్ రివ్యూలు మాత్రమే కాకుండా నెగటివ్ రివ్యూలు కూడా వస్తున్నాయి. అయితే మెజార్టీ శాతం రివ్యూలు పాజిటివ్‌ గా ఉంటున్నాయి. పాజిటివ్ రివ్యూలతో సినిమా వసూళ్లు ఆకాశమే హద్దు అన్నట్లుగా వస్తున్న విషయం తెల్సిందే. జనాలు నెగటివ్‌ రివ్యూల గురించి పట్టించుకోవడం లేదు. ఆ మాటకు వస్తే అసలు జనాలు రివ్యూలను చూస్తున్న దాఖలాలు లేవు.

జక్కన్న సినిమా కదా.. తొక్కుకుంటూ వెళ్లాలి అన్నట్లుగా టికెట్లను బుక్ చేసుకుని వెళ్లి పోతున్నారు. ఇద్దరు హీరోల సినిమా కనుక ఆలోచించకుండా వెళ్లి పోవచ్చు. ఏమాత్రం అనుమానం లేకుండా జక్కన్న సినిమా కనుక చూసేయవచ్చు. ఇది చాలా మంది అభిప్రాయం. ఈ సమయంలో కొందరు బ్యాడ్‌ రివ్యూలు ఇవ్వడం.. కొందరు బాగుంది అంటూనే సినిమాలోని కొన్ని మైనస్ పాయింట్స్ ను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నారు.

తనకు తాను గొప్ప విశ్లేషకుడిగా.. మేధావిగా చెప్పుకునే ప్రయత్నం చేసే బాబు గోగినేని ఈ సినిమాకు రివ్యూ ఇచ్చాడు. సోషల్‌ మీడియా ద్వారా తన రివ్యూను ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆయన రివ్యూ సినిమాకు చాలా నెగటివ్ గా ఉండటంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాను చూసే విధానం తెలియకుంటే నోరు మూసుకుని ఉండాలి తప్ప ఇలా చెత్త రివ్యూలు ఇవ్వడం ఏంటీ అంటూ జక్కన్న అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకు బాబు గోగినేని రివ్యూ ఏంటీ అంటే...

రాజమౌళి గారి సినిమా చాలా గ్రాండ్ గా పెద్దగా ఉంది..

ఒక చరిత్రగా ఈ సినిమాను నిలపడం కోసం చాలా కష్టపడ్డారు..

అద్భుతమైన నటన, సూపర్ సినిమాటోగ్రాఫిక్. అయితే కథపై బలహీనంగా ఉంది. అలాగే హీరోలతో కథానాయకుల సంబంధాలు చాలా పేలవమైనవిగా ఉన్నాయి. గుర్తుండిపోయే డైలాగ్‌లు లేవు. "లోడ్, ఎయిమ్‌, షూట్" తప్ప గొప్ప డైలాగ్స్ లేవు.. కథ చాలా నాసిరకంగా ఉంది. సినిమాలో మహిళలకు అస్సలు ప్రాముఖ్యత లేదు. హాస్యం కనిపించలేదు.. చాలా సన్నివేశాల్లో లాజిక్ మిస్ అయ్యింది. చివర్లో వచ్చిన పాట కు పూర్తి న్యాయం చేసే విధంగా చూపించలేదు.

ఇక సినిమా లో రక్తపాతం ఎక్కువగా ఉంది. పిల్లలకు అస్సలు ఈ సినిమా వద్దు. పెద్దలకు మాత్రమే అన్నాడు. చివర్లో సినిమాను రెండు భాగాలు ఒకే దర్శకుడు చేశాడా అంటూ బాబు గోగినేని ఫస్ట్‌ హాఫ్ మరియు సెకండ్‌ హాఫ్ లపై కామెంట్స్ చేశాడు. ఈ వివాదాస్పద రివ్యూ వైరల్‌ అవుతోంది.