Begin typing your search above and press return to search.
అ..ఆ.. అలాంటి సీన్లు తీయకండయ్యా!!
By: Tupaki Desk | 8 Jun 2016 4:09 AM GMTఈ మధ్య కాలంలో సినిమాల్లో తెలిసి కొన్ని సీన్లు పెడుతున్నారో.. తెలియక పెడుతున్నారో కాని.. వాళ్ళు పెట్టే సీన్లు ఖచ్చితంగా జనాలను రాంగ్ సైడ్ ప్రభావితం చేస్తున్నాయి. 'గాంధి' సినిమా చూసి ఎక్కువ మంది గాంధీలుగా మారిపోవాలిగా అని చాలామంది సెటైరికల్ గా కౌంటర్లు వేస్తుంటారు కాని.. ఇక్కడ మంచి విషయాలకంటే చెడు విషయాలే ఫాస్టుగా ప్రభావితం చేస్తాయి. అది తెలుసుకుని ఫిలిం మేకర్లు కొన్ని సీన్లు ఎవాయిడ్ చేస్తే బాగుంటుంది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అ..ఆ సినిమాలో కూడా ఇలా చెడుగా ఇన్ స్పయిర్ చేసే సీన్లు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? కాని ఉన్నాయ్. అసలు అ..ఆ.. చిత్రం ప్రారంభమే సమంత ఆత్మహత్యాయత్నంతో స్టార్ట్ అవుతుంది. ఆ వెంటనే హాస్పిటల్ లో ఈ సూసైడ్ ని కామెడీ చేసేస్తాడు దర్శకుడు. హీరోయిన్ ఆత్యహత్యకు కారణం.. తను సొంత నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ లేకపోవడం. ఇక ఇదే సినిమాలో హీరో తండ్రి పాత్ర కూడా ఆత్మచేసుకునే కేరక్టరే. పరువు కోసం సూసైడ్ చేసుకుని చనిపోయే పాత్ర అది. ఒకే సినిమా.. రెండు ఆత్మహత్యలు. ఒకటి వ్యక్తిత్వం కోసం.. ఇంకోటి పరువు కోసం. ఇది జనాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఆలోచించండి.
ఫ్యామిలీ రిలేషన్స్ బేస్డ్ గా నడిచే సినిమాల్లో సూసైడ్స్ ను సింపుల్ థింగ్ అనిపించేలా చూపించడం ఆలోచించాల్సిన విషయం. హీరో తండ్రి పాత్ర సూసైడ్ కారణంగా.. ఫ్యామిలీ డిస్టర్బెన్స్ చూపించడం ఒక్కటే కాస్త ఊరట. కానీ హీరోయిన్ సూసైడ్ చేసుకోవడం కానీ.. కమెడియన్స్ ను చెడామడా బాదడం కానీ చూస్తుంటే.. ఇవన్నీ యువతపై ఇమ్మీడియెట్ ఎఫెక్ట్ చూపించేవిగా అనిపిస్తాయి.
సైకిల్ తొక్కడం నుంచి వేల కోట్ల రిలయన్స్ సామ్రాజ్యానికి అధినేత అయిన ధీరూబాయ్ అంబానీపై సినిమా తీస్తే.. అందులో నుంచి జనాలు నేర్చుకునేది పెద్దగా ఏమీ ఉండదు. అదే ఆస్తి కోసం సొంతవాళ్లనో, కన్నవాళ్లనో చంపేయడం అనే టైపు కాన్సెప్టులు మాత్రం త్వరగా ఎక్కించేసుకోవడం జనాలకు బాగా అలవాటు. అందుకే సెన్సిటివ్ ఇష్యూలను సూసైడ్ మేడ్ ఈజీ అన్నట్లు బాపతుగా చూపించకుండా ఉండాలని కోరుకుందాం.