Begin typing your search above and press return to search.
ఫ్యామిలీ మ్యాన్ - మనోజ్ పై వివాదాల వర్మ ప్రశంసల జల్లు..!
By: Tupaki Desk | 12 Jun 2021 5:30 PM GMTప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకుంటున్న వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్. ఇటీవలే జూన్ 4న ఫ్యామిలీ మ్యాన్ సెకండ్ సీసన్ రిలీజ్ అయింది. ఈ కరోనా టైంలో అందరూ ఇంటిపట్టునే ఉండటంతో గతేడాది కాలంగా ప్రేక్షకులు డిజిటల్ కంటెంట్ కు అలవాటు పడ్డారు. ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంటుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ పై వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేసాడు. అదికూడా తన వెర్షన్ లో ఫ్యామిలీ మ్యాన్ రివ్యూ ఇచ్చాడు. ప్రస్తుతం వర్మ రివ్యూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
మనోజ్ బాజపేయ్ - సమంత - ప్రియమణి - గుల్ పనాగ్ కీలకపాత్రల్లో నటించిన ఈ డాషింగ్ వెబ్ సిరీస్ ప్రస్తుతం డిజిటల్ వేదికపై సంచలనం సృష్టిస్తోంది. 2019లో రిలీజ్ అయినటువంటి ఫ్యామిలీ మ్యాన్ మొదటి సీసన్ సూపర్ హిట్ కావడంతో సెకండ్ సీసన్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్.. టెర్రరిస్టుల అరాచకాలను ఎదుర్కొనేందుకు ఇంటలిజెన్స్ అధికారి పాత్రలో మనోజ్ బాజపేయ్ చేసిన సాహసాల నేపథ్యం చుట్టూ తిరుగుతుంది. నిజానికి ఈ సిరీస్ ఫిబ్రవరి నెలలో రిలీజ్ కావాల్సింది.
కానీ అమెజాన్ ప్రైమ్ వారు పలు కారణాల వలన విడుదల వాయిదా వేసింది. చివరిగా జూన్ 4న స్ట్రీమింగ్ ప్రారంభించింది. అయితే డైరెక్టర్ వర్మ స్పందించి.. "ది ఫ్యామిలీ మ్యాన్ 2.. జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీ లాగే ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, ఎంటర్‌టైన్మెంట్ మిక్స్ చేయడం చాలా కష్టం. కానీ ఇంక్రెడిబుల్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయ్ a విషయంలో న్యాయం చేశాడని వర్మ ప్రశంసించాడు. రియలిస్టిక్, డ్రామాటిక్ మధ్య తేడాను చాలా చక్కగా చూపగలిగాడు అంటూ మనోజ్ ఆకాశానికి ఎత్తేసాడు వివాదాల వర్మ. అయితే వర్మ ట్వీట్ పై స్పందించిన మనోజ్.."వర్మ ట్వీట్ తనకు అవార్డు లాంటిది" అంటూ రీట్వీట్ చేసాడు. ప్రస్తుతం వర్మ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.