Begin typing your search above and press return to search.

వాల్మీకిపై రాజ‌కీయ ర‌గ‌డ‌.. అస‌లేం జ‌రుగుతోంది?

By:  Tupaki Desk   |   16 Sep 2019 11:25 AM GMT
వాల్మీకిపై రాజ‌కీయ ర‌గ‌డ‌.. అస‌లేం జ‌రుగుతోంది?
X
రామాయ‌ణం రాసిన మ‌హ‌ర్షి పేరును గ్యాంగ్‌ స్ట‌ర్ సినిమాకు ఎలా పెడ‌తారు? .. ప్ర‌స్తుతం హాట్ టాపిక్ ఇది. ఈ వివాదం నేప‌థ్యంలో వ‌రుణ్ తేజ్ న‌టించిన వాల్మీకి రిలీజ‌వుతుందా? అవ్వ‌దా అంటూ సామాజిక మాధ్య‌మాల్లో వాడి వేడిగా ఆస‌క్తికర చ‌ర్చ సాగుతోంది. ఈనెల 20న వాల్మీకి సినిమా రిలీజవుతుంద‌ని ఇంకా చిత్ర‌యూనిట్ ధీమాగానే ఉంది. కోర్టుల ప‌రిధిలోనూ దీనిపై ఏమీ చేయ‌లేర‌న్న ధీమా అట్నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది. నిన్న సాయంత్రం ప్రీరిలీజ్ వేడుక‌లోనూ రిలీజ్ తేదీ విష‌యమై సందేహం అక్క‌ర్లేద‌న్న‌ట్టే వ్య‌వ‌హ‌రించారంతా.

అయితే ఇంత‌టితో బోయ వాల్మీకి కుల‌స్తులు వ‌దిలేశారా? అని సందేహించిన వారికి ఇదిగో ఇలా రాజ‌కీయ నాయ‌కుల రూపంలో సెగ త‌గిలింది. టైటిల్‌ ను మార్చాలంటూ ప‌లు మార్లు.. ప‌లు చోట్ల ఫిర్యాదులు కూడా చేశారు. గ‌ల్లీ నుంచి దిల్లీ వ‌ర‌కూ పోరాటం సాగిస్తూనే ఉన్నారు. ఇంత‌కుముందు అనంత‌పురం ఎంపీ దిల్లీ వెళ్లి కేంద్ర ప్ర‌సారాల స‌మాచార శాఖ‌ మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్ ని క‌లిసిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బంగారు ల‌క్ష్మణ్ ను బోయ సామాజిక వ‌ర్గానికి చెందిన నేతలు హైద‌రాబాద్ లో క‌లిశారు. ల‌క్ష్మ‌ణ్ వారికి మ‌ద్ధ‌తుగా నిల‌వ‌డ‌మే గాక‌ బోయ సామాజిక వ‌ర్గ నేత‌లు సెన్సార్ బోర్డుకి `వాల్మీకి` టైటిల్‌ ను మార్చాలంటూ ఫిర్యాదు చేశారు. ఈ సంద‌ర్భంగా ల‌క్ష్మ‌ణ్ మాట్లాడుతూ ``గ్యాంగ్‌ స్ట‌ర్ మూవీకి `వాల్మీకి` టైటిల్ పెరు పెట్టడం వల్ల బోయ సామాజిక వర్గం మనోభావాలు దెబ్బతిన్నాయి. రామాయణం రాసిన వాల్మీకిని గ్యాంగ్‌ స్ట‌ర్ తో పోలిక స‌రికాదు. సెన్సార్ బోర్డుకి ఫిర్యాదు చేశాం. త‌క్ష‌ణ‌మే సినిమా టైటిల్‌ను మార్చాలి. లేక‌పోతే బోయ‌లంతా ఏక‌మ‌వుతారు. త‌ద‌నంత‌ర ప‌రిణామాల‌కు యూనిట్ బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంది`` అన్నారు. అయితే వివాదాల‌తో ప్ర‌చారం వాల్మీకి బాక్సాఫీస్ కి క‌లిసి రానుందా? అంటూ యూత్ లో అంతే వేడెక్కించే చ‌ర్చ సాగుతోంది. అయితే వివాదాల‌తో ప్ర‌చారంతో అంద‌రికీ తెలుస్తుంది. కానీ కంటెంట్ లో మ్యాట‌ర్ లేక‌పోతే జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డం క‌ష్ట‌మేన‌ని ఎన్టీఆర్ బ‌యోపిక్ స‌హా చాలా సినిమాల విష‌యంలో ప్రూవైంది.