Begin typing your search above and press return to search.
టాప్ స్టోరి: నిర్మాతల్లో మంటలకు పరిష్కారమేది?
By: Tupaki Desk | 16 Jun 2019 7:15 AM GMTటాలీవుడ్ కి దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత నిర్మాతల మండలి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. జూన్ 30న ఎన్నికలు జరుగుతాయని అధికారికంగా ప్రకటించారు. ఆ క్రమంలోనే ఈసారి మండలి ఎన్నికలు రసవత్తరంగా ఉంటాయా? అంటూ సినీవర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. అయితే నిర్మాతల మండలి ఎన్నికల సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి.
అసలు ఇన్నాళ్లు నిర్మాతల మండలిలో వర్గ విభేధాల గురించి చర్చ సాగినా .. ఇందులో ఇంత లోతైన సంఘర్షణ ఉందా? అని ఆశ్చర్యపోయే నిజాలు బయటపడుతున్నాయి. వందల మంది నిర్మాతలు ఉన్న మండలిలో అసలు ఏ సినిమాలు తీయకుండా హల్ చల్ చేసేవాళ్లే ఎక్కువ. ఇన్సూరెన్సులు .. హౌసింగ్ స్కీమ్స్ అంటూ రకరకాల స్కీముల్లో లబ్ధి పొందేవాళ్లలో అసలు రెగ్యులర్ గా సినిమాలు తీసేవాళ్లే లేరన్న నిజం ఆశ్చర్యపరుస్తోంది. అయితే రకరకాల స్కీములు.. రకరకాల వ్యవహారాల వల్ల నిర్మాతల మండలికి తీవ్రమైన నష్టం వాటిల్లిందని ఇటీవలే తుపాకి ఎక్స్ క్లూజివ్ గా ప్రత్యేక కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి రెగ్యులర్ గా సినిమాలు తీసే నిర్మాతలంతా ఎల్.ఎల్.పి పెట్టుకుని బయటకు వెళ్లిపోయారు. ఇటీవలే వీళ్లంతా ఎల్.ఎల్.పి నిర్మాతల గిల్డ్ అనేది ఫామ్ చేసి దాని ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్నారు. అంటే నిర్మాతల మండలి నుంచి విడిపోయి వీళ్లంతా వేరు కుంపటి తో మండలి అభివృద్ధికి చెక్ పెట్టేశారనే దీనర్థం. అంతేకాదు పరిశ్రమను శాసిస్తూ డిజిటల్ రిలీజ్ సహా ప్రకటనలు ఎలా ఇవ్వాలి.. ఎవరికి ఇవ్వాలి? అన్న కొత్త రూల్స్ ని ప్రతిపాదించి కార్యకలాపాలు సాగిస్తున్నారు. అయితే దీని వల్ల నిర్మాతల మండలికి ఆదాయం సున్నా అయిపోయిందని.. తీవ్ర నష్టం వాటిల్లుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినిమాలు తీసేవాళ్ల వల్ల రావాల్సినది రాకుండా పోవడంతో మండలికి నష్టం తప్పడం లేదు.
తాజా పరిణామాల క్రమంలో ఇంతకీ ఏది అసలైన నిర్మాతల మండలి? అన్న ప్రశ్న పుట్టుకొస్తోంది. మండలిలో ఉన్నంత మాత్రాన సినిమాలు తీయని వాళ్లు నిర్మాతలు ఎలా అవుతారు? సినిమాలు తీసేవాళ్లే కదా పరిశ్రమకు అవసరం అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆ క్రమంలోనే పరిస్థితిని చక్క దిద్దేందుకు.. తిరిగి సినిమాలు తీసే బడా నిర్మాతలందరినీ కలుపుకునేందుకు నిర్మాతల మండలి తరపున సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ - ప్రసన్నకుమార్ బృందం సన్నాహాలు చేయడం చర్చకొచ్చింది. ఎల్.ఎల్.పి వాళ్లతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్నారు.
ఇకపోతే ఈ వివాదంపై సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. ఎన్నికలు పూర్తయ్యాక పదవులకు అందరూ రాజీనామాలు చేస్తారని పరిశ్రమ పెద్దల సలహాలు.. సూచనలు తీసుకుని కొత్త కౌన్సిల్ ని ఎన్నుకుంటామని అన్నారు. కౌన్సిల్ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం ఉన్న మండలి ఉనికికి ప్రమాదం లేకుండా జాగ్రత్త పడతామని చెబుతున్నారు. ఈ వ్యవహారంలో తెలంగాణ ఫిలిండెవలప్‌మెంట్ చైర్మన్ రామ్మోహన్ రావు.. జి ఆదిశేషగిరిరావు సహా కోర్ కమిటీ సభ్యులు అరవింద్ - సురేశ్ బాబు - కేఎల్ నారాయణ తదితరులతో మంతనాలు సాగిస్తున్నారు. అయితే ఈ పెద్దలంతా అసలు సినిమాలు తీయని వాళ్లంతా మాపై సవారీ చేస్తారా? అంటూ అలిగి సపరేట్ ఎల్.ఎల్.పిని పెట్టుకున్నారు. మరి ఆ సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తున్నారనే అనుకోవాలా? ఏదేమైనా అలిగి వేరు కుంపటి పెట్టుకున్న అసలు పెద్దలంతా నిర్మాతల మండలిలో కలుస్తారా? అన్నది పెద్ద చిక్కు ప్రశ్న. కొన్నిటికి కాలమే సమాధానం చెప్పాలి. నిర్మాతల మండలి ఎన్నికల తేదీని ప్రకటించినా చెప్పిన టైముకే ఎన్నికలు జరగాలంటే ముందుగా వర్గ విభేధాలు పరిష్కృతం కావాల్సి ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు.