Begin typing your search above and press return to search.
'సర్కార్' కు అనుకోని వరం
By: Tupaki Desk | 9 Nov 2018 6:54 AM GMTఒకప్పుడు ఓ సినిమాను ఏదైనా వివాదం చుట్టుముడితే నిర్మాత భయపడేవాడు. కానీ ఇప్పుడు ఓ సినిమా వివాదంలో చిక్కుకుంటే ఎగిరి గంతేసే పరిస్థితి. ఒక స్థాయి వరకు వివాదం అనేది సినిమాకు మేలే చేస్తోంది. దాని వల్ల సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ వస్తోంది. తమిళనాట స్టార్ హీరో విజయ్ సినిమా వస్తోందంటే ఏదో ఒక వివాదం ఉండాల్సిందే. కొన్నేళ్ల కిందట ‘కత్తి’ రిలీజైనపుడు ఎంత గొడవ జరిగిందో తెలిసిందే. ఆ గొడవ విషయంలో ముందు నిర్మాతలు భయపడ్డా.. దాని వల్ల విపరీతమైన పబ్లిసిటీ వచ్చి సినిమాకు మేలే జరిగింది. ఇక గత ఏడాది ‘మెర్శల్’ విడుదల సందర్భంగా ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఎన్డీయే సర్కార్ చేపట్టిన డీమానిటైజేషన్ సహా కొన్ని నిర్ణయాలపై సినిమాలో మంచి సెటైర్లు పడ్డాయి. దీని గురించి గొడవ గొడవ చేశారు. కొన్ని డైలాగులు తీయించేశారు. ఈ వివాదం సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చింది. సినిమా అనుకున్న దాని కంటే పెద్ద బ్లాక్ బస్టర్ అయింది.
ఇప్పుడు ‘సర్కార్’ విషయంలోనూ అలాగే జరుగుతోంది. తమిళనాట సమకాలీన రాజకీయాల నేపథ్యంలో సాగే సినిమా ఇది. ప్రస్తుత ప్రధాన పార్టీలన్నింటి పైనా ఇందులో సెటైర్లు పడ్డాయి. అందులోనూ అధికార అన్నాడీఎంకే మీద డైరెక్ట్ అటాకే జరిగింది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత అసలు పేరు అయిన కోమలవల్లిని ఇందులో విలన్ పాత్రకు పెట్టేశారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. పోస్టర్లు చించేస్తున్నారు. థియేటర్ల మీదా దాడికి దిగుతున్నారు. సినిమాలో ఆ పేరుతో పాటు కొన్ని సన్నివేశాల్ని తొలగించాలంటూ డిమాండ్లు మొదలయ్యాయి. ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆదేశాలు జారీ చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. దీంతో సినీ రంగం ఏకమైంది. ‘సర్కార్’కు అండగా నిలిచే ప్రయత్నం చేస్తోంది. ఈ గొడవ జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అవుతుండటంతో సినిమాకు మంచి పబ్లిసిటీ వస్తోంది. డివైడ్ టాక్ ఉన్నప్పటికీ.. ఆ ప్రభావం ఏమీ లేకుండా తొలి రోజు నుంచి ఎక్కడా తగ్గకుండా వసూళ్ల మోత మోగిస్తున్న ‘సర్కార్’కు ఈ వివాదం వల్ల మేలే జరిగేలా ఉంది.