Begin typing your search above and press return to search.
జార్జిరెడ్డి వివాదం.. మరింత పబ్లిసిటీ
By: Tupaki Desk | 18 Nov 2019 5:30 PM GMTఉస్మానియా యూనివర్శిటీ స్టూడెంట్ లీడర్ జార్జిరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన 'జార్జిరెడ్డి' చిత్రం ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. పాతికేళ్ల వయసులోనే చదువులోనూ ఉద్యమంలోనే సంచలనం సృష్టించిన జార్జిరెడ్డి జీవిత చరిత్రను వెండి తెరపై చూసేందుకు ప్రేక్షకులు అమితాశక్తితో ఉన్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పేరుతో సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కింది. ఈ సమయంలోనే ఈ సినిమా చుట్టు వివాదం రాజుకుంది. దాంతో మీడియాలో ప్రముఖంగా ఈ చిత్రం గురించి వార్తలు వస్తున్నాయి.
ఈ చిత్రంపై ఏబీవీపీ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో ఏబీవీపీ స్టూడెంట్ లీడర్స్ ను రౌడీలుగా చిత్రీకరించారంటూ విమర్శించారు. జార్జిరెడ్డిపై 15 క్రిమినల్ కేసులు ఉన్నాయని.. వాటిని చూపించకుండా కేవలం హీరోగానే చూపించేందుకు ఈ సినిమాను తెరకెక్కించారంటూ ఏబీవీపీ నాయకులు అంటున్నారు. ఆయన క్రిమినల్ చరిత్రను కూడా సినిమాలో చూపించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. జార్జిరెడ్డి హత్య కేసులో ఏబీవీపీ విద్యార్థి నాయకుల హస్తం లేదంటూ గతంలోనే కోర్టు తీర్పు ఇచ్చినా కూడా ఇప్పుడు ఈ సినిమాలో మళ్లీ అదే విషయాన్ని ప్రస్తావించినట్లుగా వారు అంటున్నారు.
చాలా సంవత్సరాల క్రితం జరిగిన విషయాలను మళ్లీ ఇప్పుడు చూపిస్తూ ఏబీవీపీ కార్యకర్తలను రౌడీలుగా చిత్రీకరించేందుకు ఈ సినిమాలో ప్రయత్నించారంటూ వారు అభ్యంతరం చెబుతున్నారు. అయితే తమ సినిమాలో అన్ని వాస్తవాలను చూపిస్తామని.. ఏ ఒక్కరిని కాని ఏ ఒక్క సంస్థను కాని టార్గెట్ చేసి చూపించలేదంటూ దర్శకుడు జీవన్ రెడ్డి చెబుతున్నాడు. సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్నా కొద్ది సినిమాకు మీడియాలో ప్రచారం భారీగా జరుగుతోంది. దాంతో జార్జిరెడ్డికి ఖచ్చితంగా మంచి ఓపెనింగ్స్ రావడం కన్ఫర్మ్ అంటున్నారు.