Begin typing your search above and press return to search.
సీతకు వివాదాల పెట్రోల్
By: Tupaki Desk | 23 May 2019 5:54 AM GMTరేపు విడుదల కానున్న సీత మీద భారీ హైప్ లేదు కాని ఓ మోస్తరు అంచనాలతో మౌత్ టాక్ మీద నమ్మకంతో ధియేటర్లలోకి అడుగు పెడుతోంది. అయితే నిన్న అనూహ్యంగా బిజేవైఎం సంస్థ హిందు మనోభావాలను దెబ్బ తీస్తున్నారని సీత సినిమా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ విడుదల ఆపాలని డిమాండ్ చేసింది. దీనికి దర్శకుడు తేజ బదులిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ సెన్సార్ క్లియరెన్స్ వచ్చిన తమ సినిమాను ఆపే ప్రసక్తే లేదని ఖచ్చితంగా ప్లాన్ చేసుకున్న స్క్రీన్లు అన్నింటిలోనూ షోలు పడతాయని తేల్చి చెప్పేశారు. ఇది ఇంకాస్త వివాదాన్ని రాజేసే అవకాశం లేకపోలేదు
కాని ఇక్కడో ట్విస్ట్ ఉంది. ఇవాళ ఎన్నికల ఫలితాల నేపధ్యంలో ఈ గొడవను పట్టించుకునే మూడ్ లో జనం లేరు. దేశ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనే దాని మీదే అందరూ దృష్టి పెడుతున్నారు. సీత మీద ఎంత వివాదం రేగినా అది రేపటికిగాని వెలుగులోకి రాదు. సో సీత సాఫీగా వచ్చేస్తుంది. ఇది కాస్త పెద్ద ఇష్యూ అయ్యుంటే పబ్లిసిటీ పరంగా ప్లస్ అయిపోయి ఓపెనింగ్స్ కి ఇంకాస్త మైలేజ్ దొరికేది. అయినా కూడా సీతకు ఇది ఎంతో కొంత హెల్ప్ అయ్యేదే. నిజంగా సీతను అవమానించే విధంగా ఇందులో ఏదైనా ఉందో లేదో తెలిసేది రేపటికే. అప్పటిదాకా వేచి చూడాలి